అందంలో వింత పోకడలు... ప్రపంచదేశాల మహిళల బ్యూటీ నిర్వచనాలివే..

First Published | Jul 10, 2021, 1:23 PM IST

రకరకాల దేశాల్లో అందానికి రకరకాల ప్రామాణికతలున్నాయి. ఏఏ దేశాల్లో మహిళలు తమ అందానికి ఏ రకంగా మెరుగులు దిద్దుకుంటారు. ఎలా ఉంటే.. అందంగా ఉన్నారంటూ పడి చచ్చిపోతారో చూడండి. 

అందం అంటే ఏమిటి? అందానికి ప్రామాణికత ఏమిటి? అంటే... ఒక్కో దేశం.. ఒక్కోరకంగా అందానికి నిర్వచనం చెబుతుంది. అయితే అందం అంటే వ్యక్తిత్వం, వారి వారి ప్రత్యేకత అంతే.. అందానికి నిర్వచనం చెప్పడం అంటే మానసిక వెనకబాటు తనాన్ని చూపించడమే.
undefined
ఇదంతా ఓ వాదన.. అయితే రకరకాల దేశాల్లో అందానికి రకరకాల ప్రామాణికతలున్నాయి. ఏఏ దేశాల్లో మహిళలు తమ అందానికి ఏ రకంగా మెరుగులు దిద్దుకుంటారు. ఎలా ఉంటే.. అందంగా ఉన్నారంటూ పడి చచ్చిపోతారో చూడండి.
undefined

Latest Videos


యుకె : యుకెలో మహిళలు తమ శరీరాలను ట్యానింగ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. దీనికి విరుద్ధంగా భారత్ లో అందం అంటే తెల్లటి తెలుపుగా పరిగణించబడుతుంది. యూకేలో చర్మపు రంగును సౌందర్యంగా కనిపించే ముదురు రంగులోకి మార్చడానికి స్పెషల్ గా టానింగ్ స్ప్రేలు, టానింగ్ బెడ్స్ ఉపయోగిస్తారు. 59% మంది మహిళలు నెలకు కనీసం 5 సార్లు సెల్ఫ్ ట్యానర్లను వాడతారు.
undefined
యుఎస్ఎ : యుఎస్ఎలో మహిళలు అవయవసౌష్టవం పెద్దగా ఉండడాన్ని ఇష్టపడతారు. దీనికికైలీ జెన్నర్, కిమ్ కర్దాషియాన్ వంటి ప్రముఖులు నాంది పలికారు. ఈ బాటలో ఇప్పుడు వేలాది కాస్మెటిక్ విధానాలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.
undefined
బ్రెజిల్ : యూఎస్ కు విరుద్ధంగా బ్రెజిల్‌లోని మహిళలు చిన్న రొమ్ములు, గుండ్రటి పిరుదులు కలిగి ఉండడాన్ని అందంగా భావిస్తారు. దీనికోసం బిబిఎల్ (బ్రెజిలియన్ బట్ లిఫ్ట్) శస్త్రచికిత్సలు బాగా ప్రసిద్ది చెందాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని అనుసరిస్తున్నారు.
undefined
జమైకా : జమైకాలో మహిళలు “ఆరోగ్యకరమైన శరీరం” కోసం తపించిపోతారు. స్త్రీలు కేవలం 70-95 కిలోల మధ్య ఉండాలని ప్రయత్నిస్తారు. విశాలమైన నడుము భాగం, పెద్ద పెద్ద పిరుదులు ఉండాలని కోరుకుంటారు. దీనికోసం అక్కడ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘చికెన్ పిల్స్’ అనే మాత్రలు కూడా దొరుకుతాయి. వీటిని అక్కడి ఫౌల్ట్రీ రైతులు కోళ్లు తొందరగా పెరగడానికి వేస్తుంటారు.
undefined
ఫ్రాన్స్ : ఫ్రాన్స్‌లో మహిళలు సన్నగా, నాజూగ్గా కనిపించడానికి ఇష్టపడతారు. పశ్చిమ ఐరోపా అంతటా చాలా తక్కువ బరువు ఉండేవారు ఫ్రెంచ్ మహిళలు అనే చెబుతారు. అందుకే ఇక్కడ అనోరెక్సియా అనేది ఫ్రాన్స్ లో చాలా సాధారణంగా కనిపిస్తుంది.
undefined
ఇండియా : భారతదేశంలో మహిళలు తెల్లగా కనిపించడానికి ఇష్టపడతారు. దీనికోసం చర్మాన్ని మెరిపించే చిట్కాలు బాగా పాటిస్తారు. సాంప్రదాయిక మనస్తత్వం ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రబలంగా ఉంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి పసుపు, ముల్తానీ మిట్టి, వంటింటి చిట్కాలు ఉపయోగిస్తారు.
undefined
వెనిజులా : వెనిజులాలో మహిళలు బ్రెస్ట్ ఎన్ లార్జ్ మెంట్ విషయంలో అబ్జెస్ గా ఉంటారు. అక్కడి అమ్మాయిల 15వ పుట్టినరోజు వేడుకలకు బ్రెస్ట్ ఎన్ లార్జ్ మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది పాపులర్ గిప్ట్. రొమ్ములు పెంచుకునే గిఫ్ట్ కార్డులు ఇవ్వడం అనేది అక్కడ సర్వసాధారణం.
undefined
ఇరాన్ : ఇరాన్‌లో మహిళలు ముక్కు ఆపరేషన్లు చేయించుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ముక్కు సర్జరీ చేయించుకోవడం స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఇప్పటికే ఇరాన్‌లో 70,000 మందికి ముక్కుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.
undefined
ఒక దేశంలో అందానికి ప్రామాణికమైనది.. మరో దేశంలో విడ్డూరంగా, తెలివి తక్కువగా పరిగణిస్తారు. అయితే అది మామూలే.. మానసిక అందానికి మించిన అందం లేదనేది గుర్తు పెట్టుకోవాలి.
undefined
click me!