బంతిపూవు.. మనదేశంలో ఏ శుభాశుభకార్యాలైనా తప్పనిసరిగా ఉండే పువ్వు. పసుపురంగుతో ఆకట్టుకునే బంతిపువ్వుతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
undefined
పెళ్లిళ్లు, పండుగల్లో అయితే ముద్దబంతి లేకుండా ఆ ఫంక్షన్ కు కళే రాదు. అందుకే దీన్ని వెడ్డింగ్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. మెహందీ ఫంక్షన్ లో వధువుకు ముద్దబంతి అలంకారం.. మరింత వన్నె తెస్తుంది.
undefined
అయితే ముద్దబంతి అందంకోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా బాగా పనిచేస్తుంది. దీంట్లోని సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ సుగుణాలు మీ చర్మానికి చక్కటి క్లెన్సింగ్ లాగా పనిచేస్తాయి.
undefined
బంతిపూలను నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లార్చి, వడకట్టి వాటితో మొహం కడుక్కోవాలి. మొహానికి సహజమైన టోనర్ లాగా బాగా పనిచేస్తుంది.
undefined
బంతిపూలతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల మొహంమీది మచ్చలు, మరకలు తొలిగించుకోవచ్చు.
undefined
బంతిపూల ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలంటే.. కొన్ని బంతిపూలను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా తయారు చేయాలి. దీనికి ఓ స్పూన్ అలివ్ ఆయిల్ కలపాలి. దీనివల్ల పేస్ట్ తొందరగా పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్ జార్ లో తీసుకుని జాగ్రత్తచేస్తే 4,5 రోజులవరకు వాడుకోవచ్చు.

ఇప్పుడీ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసి ఆరిపోయాక చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా నెలరోజులపాటు రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
undefined
ఒక కప్పు మంచినీటిలో కొన్ని బంతిపూల రెక్కలు వేసి .. ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లార్చి, వడకట్టి తాగితే.. కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
undefined