Driving:కారు డ్రైవింగ్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే తోపులు.. ఏ టైమ్ లో కారు డ్రైవ్ చేయకూడదు?

Published : Jul 07, 2026, 10:19 AM IST

 Driving: కారు ఎంత వేగంగా నడుపుతున్నాం అనేది ముఖ్యం కాదు.. ఎంత జాగ్రత్తగా నడుపుతున్నాం అనేది చాలా ముఖ్యం. మరి ఈ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు ముందంజలో ఉన్నారో తెలుసా? 

PREV
13
సర్వే ఏం చెబుతోంది..?

Driving: కారు డ్రైవింగ్ ఎవరు బాగా చేస్తారు..? అమ్మాయిలా అబ్బాయిలా? ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానం చెబుతారు? పక్కాగా అబ్బాయిలే చాలా బాగా చేస్తారనే చెబుతారు కదా.. కానీ, సర్వేలు ఏమంటున్నాయో తెలుసా? అంతేకాదు.. మన దేశంలో.. ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయో తెలుసా? ఏ సమయంలో ఎక్కువ మంది రోడ్డుపై ఉంటారు? ఈ విషయాలన్నింటినీ ఇండియా రోడ్ సేఫ్టీ తన తాజా రిపోర్టులో పేర్కొంది. 2026లో విడుదల చేసిన ఈ రిపోర్టులో చాలా ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. దాదాపు 17 రాష్ట్రాల్లో ఈ సర్వే చేసి.. రిపోర్ట్ విడుదల చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

23
కారు నడపడంలో ఎవరు బెస్ట్..?

ఇప్పటి వరకు అబ్బాయిలు మాత్రమే కారు అద్భుతంగా నడపగలరు అనే భావన చాలా మందిలో ఉంటుంది.అమ్మాయిల డ్రైవింగ్ పై చాలా జోకులు కూడా వేస్తూ ఉంటారు. కానీ.. ఈ సర్వేలో ఇది తప్పు అని తేలింది. పురుషులతో పోలిస్తే.. మహిళలే చాలా జాగ్రత్తగా నడుపుతారని సర్వేలో తేలింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 నమోదు చేయగా, పురుషుల స్కోర్ 92.43 ఉండటం విశేషం.

33
ఏ సమయంలో రోడ్డు మీదకు వెళ్లకూడదు..

ఈ సర్వేలో తేలిన రిపోర్టు ప్రకారం.. రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో.. ఎక్కువ మంది రోడ్డు మీద వాహనాలు నడుపుతూ ఉంటారట. మధ్యాహ్నం తో పోలిస్తే.. రాత్రిపూట ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని.. రాత్రి 9 తర్వాత రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.

దేశంలో రోడ్డు ప్రమాదాలు..

మన దేశంలో ప్రతి సంవత్సరం 1.73 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదౌతున్నాయి. ఇది ప్రపంచ మొత్తం మరణాలలో దాదాపు 11శాతానికి సమానం. ఈ రోడ్డు ప్రమాదాల్లో 44 శాతం ద్వి చక్ర వాహనదారులు కాగా, 19 శాతం పాదచారులు కూడా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories