ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం...
ఈ ఫైల్ షేరింగ్ ఫీచర్ తో మనం ఫోటోలు, వీడియోలు పంపుకోవచ్చు. దాని కోసం పంపే వ్యక్తికి, స్వీకరించే వ్యక్తి ఇద్దరికీ ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. వారిద్దరికీ వాట్సాప్ ఉంటే సరిపోతుంది. దాని కోసం వాళ్లు..వ ాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. మనం బ్లూటూత్ తో ఒకప్పుడు ఫోటోలు, వీడియోలు ఎలా పంపుకునేవాళ్లమో అలాగే.. ఈ ఫీచర్ కూడా పని చేస్తుంది. నెట్ లేదు కదా.. ఎంత సేపు పడుతుందో అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఫోన్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి.. చాలా ఈజీగా నే ఎక్కువ సమయం తీసుకోకుండానే పంపేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతానికి , ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందట. మరి కొద్ది రోజుల్లోనే ఫైల్ షేరింగ్ ఫీచర్ ఎప్పుడైనా మీ ముందుకు రావచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, సమీపంలోని ఇద్దరు వినియోగదారులు చాలా సులభంగా తమ వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోగలరు.