Vitamin B12
ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరం ఊహించలేరు. మనం ఆరోగ్యంగానే ఉన్నామని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామనే భ్రమలోనే చాలా మంది ఉండిపోతారు. కానీ... మన బాడీలో ఏదైనా విటమిన్ లోపం ఉన్నా.. మనకు తొందరగా తెలీదు. కానీ.. కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే ఆ లోపాన్ని గుర్తించవచ్చట.
vitamin b12
ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు విటమిన్ బి12 లోపంతో బాధఫడుతున్నారు. మన శరీరంలో విటమిన్ బి12 ఉంటే మంచి ఎనర్జీ ఉంటుంది. న్యూరలాజికల్ ఫంక్షన్ సరిగా జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు అయితే.. బి12 విటమిన్ పుష్కలంగా ఉంటే.. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే... ఈ విటమిన్ లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓసారి చూద్దాం..
vitamin b12
విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో ఎక్కువగా నీరసం ఉంటుంది. రెస్ట్ తీసుకున్నా కూడా ఆ నీరసం తగ్గదు. ఎందుకంటే బి12 విటమిన్ ఉంటే.. మనకు నీరసం ఉండదు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటాం. కాబట్టి.. మరీ నీరసంగా అనిపిస్తూ ఉంటే.. ఒకసారి టెస్టు చేయించుకోవడమే మంచిది.
vitamin b12
విటమిన్ బి12 లోపం మెగాలోబ్లాస్టిక్ ఎనిమీయాకు దారి తీస్తుంది. దీని వల్ల,... దీని లోపం చర్మం పై స్పష్టంగా కనిపిస్తుంది. పసుపు రంగులో తేలిపోయినట్లుగా కనపడతారు.అంటే.. ఎర్ర రక్త కణాల ప్రొడక్షన్ తగ్గిపోయిందని అర్థం. ఆక్సీజన్ సరఫరా సరిగా జరగడం లేదని దాని అర్థం. అది చర్మంపై స్పష్టంగా కనపడుతుంది.
vitamin b12
విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో నరాల సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా చతులు, కాళ్లల్లో నరాల బలహీనత స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకొని తగిన.. ట్రీట్మెంట్ తీసుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
అంతేకాదు.. విటమిన్ బి12 లోపం ఉన్నవారికి నడవడం చాలా కష్టంగా ఉంటుంది. నడుస్తూ నడుస్తూనే పడిపోతూ ఉంటారు. విపరీతంగా కాళ్ల నొప్పులు ఉంటాయి.
విటమిన్ బి12 లోపం ఉన్నవారు ప్రతి విషయాన్ని ఊరికూరికే మర్చిపోతూ ఉంటారు. చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు మర్చిపోతూ ఉంటారు. ఏకాగ్రత పెట్టాలనుకున్నా కూడా పెట్టలేరు. మెదడు పనితీరు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది.
vitamin b12 deficiency
విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో మూడ్ ఛేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఊరికూరికే డ్రిపెషన్ లోకి వెళ్లిపోతారు. ఇరిటేట్ అవుతూ ఉంటారు. యాంక్సైటీ ఎక్కువగా ఉంటుంది. కంటి చూపులోనూ చాలా తేడాలు వచ్చేస్తాయి. మౌత్ అల్సర్స్.. అంటే.. నోట్లో పుండ్లు వచ్చేస్తాయి. ఈ లక్షణాలు ఏవి కనపడినా వెంటనే వైద్యలను సంప్రదించడం మంచిది.