చలికాలంలో దగ్గు, జలుబు ఉంటే పెరుగును తినొచ్చా? లేదా.. అసలు ఈ సీజన్ లో పెరుగును తినడం సేఫేనా?

Published : Dec 20, 2022, 10:49 AM IST

నిజానికి పెరుగు మన  ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ చలికాలంలో పెరుగును తినని వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే పెరుగు జలుబును పెంచుతుందని. అసలు ఈ కాలంలో తినాలా? వద్దా? అనే దానిపై నిపుణులు ఏమంటున్నారంటే..?   

PREV
16
చలికాలంలో దగ్గు, జలుబు ఉంటే పెరుగును తినొచ్చా? లేదా.. అసలు ఈ సీజన్ లో పెరుగును తినడం సేఫేనా?

ఎండకాలంలో ప్రతి ఇంట్లో పెరుగు తప్పకుండా ఉంటుంది. అందులోనూ మూడు పూటలా పెరుగుతో తినేవాళ్లు కూడా ఉన్నారు. పెరుగు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీనిలో ఉండే కాల్షియం మన ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇంతేకాదు పెరుగును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక చలికాలం విషయానికొస్తే.. ఈ సీజన్ లో పెరుగును తినే వారు చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. పెరుగును తినడం వల్ల మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. దీంతో మరింత చలి పెడుతుందని చాలా మంది అనుకుంటారు. అంతేకాదు ఈ సీజన్ లో పెరుగును తింటే జలుబు చేస్తుందని భావిస్తారు. అయితే కొంతమంది ఈ సీజన్ లో దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్నా.. పెరుగును తినాలనుకుంటారు. పెద్దలు మాత్రం ఇలా అస్సలు తినకూడదని చెప్తుంటారు. అసలు దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26

దగ్గు, జలుబుంటే పెరుగును తినకూడదా? 

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెరుగు గ్రంధుల నుంచి స్రావాలను పెంచుతుంది. అలాగే శ్లేష్మ స్రావాన్ని కూడా బాగా పెంచుతుంది. ఇది మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెరుగు కఫ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అధిక శ్లేష్మం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం, జలుబు, దగ్గును వంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో.. అందుకే చలికాలంలో ముఖ్యంగా రాత్రి పూట పెరుగును తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. 
 

36
curd

చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతుంటే పాల ఉత్పత్తులను మొత్తమే తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. పాలు కూడా కఫానికి కారణమవుతాయి. ఇక మీకు అప్పటికే కఫం ఉంటే అది గట్టిపడటానికి దారితీస్తుంది. ఇది గొంతులో మరింత చికాకుకు పెంచుతుంది. 

46

శీతాకాలంలో పెరుగు ఆరోగ్యానికి మంచిదా?  చెడ్డదా?

పెరుగు మనకు చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ బాగా తెలుసు. వాస్తవానికి పెరుగులో ఉండే కొన్ని లక్షణాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెరుగులో ప్రోబయోటిక్స్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పలు పరిశోధనల ప్రకారం.. జింక్ జలుబు లక్షణాలను తగ్గిస్తుంది. కాని దీని ప్రయోజనాల కోసం అవసరమైన జింక్ మొత్తం కనీసం 75 మిల్లీగ్రాములు. ఇది 8 ఔన్సుల కప్పు పెరుగులో ఉన్న 2 మిల్లీగ్రాముల కంటే చాలా ఎక్కువ. 
 

56

చలికాలంలో పెరుగు తినాలా వద్దా?

 ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఏ ఆహారాన్ని తీసుకున్నా మితంగా తీసుకోవాలి. అప్పుడే దాని నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. పెరుగు విషయంలో కూడా అంతే. చలికాలంలో కూడా పెరుగును ఎంచక్కా తినొచ్చు. కాని మరీ చల్లగా ఉండే పెరుగును తినకూడదు. చలికాలంలో చల్లని ఉష్ణోగ్రత కలిగిన ఆహారాలను తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాటిని శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం రెండు రెట్లు కష్టపడాల్సి ఉంటుంది. 

66

చలికాలంలో పెరుగు ప్రయోజనాలను పొందడానికి ఒక గొప్ప మార్గం పెరుగు అయిన వెంటనే తినడం. అదికూడా గది ఉష్ణోగ్రత వద్ద. లేదా వెచ్చని వంటకాలకు కలిపి తీసుకోవచ్చు. మీ జలుబు, దగ్గు మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి పెరుగు అన్నం, దహి కబాబ్ తయారు చేసుకుని తినొచ్చు. కానీ భోజనం తర్వాత పెరుగును కానీ, పెరుగు ఆధారిత వంటకాలను గాని అసలే తినకూడదు. చలికాలంలో పెరుగును మధ్యాహ్నం పూట తినడమే మంచిది. కానీ ఎక్కువగా తినకూడదు. కప్పు పెరుగు తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. 

Read more Photos on
click me!

Recommended Stories