స్వీట్లు, కూల్ డ్రింకులు, చాక్లెట్లు ఇలా అనేక రకాల్లో ఆహారంలో పంచదార భాగమైపోతోంది. తీపి రుచి ఎక్కువ మందికి నచ్చుతుంది కాబట్టి ప్రతిరోజూ పంచదారతో చేసిన ఆహారాలు తినే వారు అధికంగా ఉన్నారు. అయితే మీ డైట్లోంచి పంచదారను తొలగిస్తే ముఖం అందంగా మెరిసిపోతుందని చెబుతున్నారు వైద్యులు.
ఎక్కువ చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు, శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల శరీరం ఎక్కువ నీటిని, సోడియంను నిల్వ ఉంచుకుంటుంది. చక్కెర మానేసినప్పుడు, ఈ అనవసరమైన నీరు బయటకు పోయి ముఖంలో వాపు తగ్గుతుంది.
ఎక్కువ చక్కెర రక్తంలోని ప్రొటీన్లతో కలిసి 'గ్లైకేషన్' (Glycation) అనే ప్రక్రియకు కారణమవుతుంది. ఇది చర్మం సాగే గుణానికి కారణమైన కొల్లాజెన్ (Collagen), ఎలాస్టిన్ (Elastin) ప్రొటీన్లను దెబ్బతీస్తుంది. చక్కెర మానేయడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ముఖం యవ్వనంగా, సన్నగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది.