తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటూనే.. అధిక ప్రోటీన్ అందించే విషయంలో మేక మాంసం ముందు ఉంటుంది. అయితే గొర్రె మాంసంలో పోషకాలు లేవని కాదు, అందులో కొవ్వు శాతం కొంచెం ఎక్కువ. అందుకే.. ఈ రెండింటిలో మేక మాంసమే ఆరోగ్యానికి మంచిది.
అయితే.. మనం సరిగా వండినప్పుడు మాత్రమే పోషకాలు మనకు అందుతాయి.మీరు మేక మాంసమే తింటున్నప్పటికీ.. దాన్ని కేజీల కొద్దీ నూనె, కొవ్వు, ఉప్పు , ఘాటైన మసాలాలు వేసి ఫ్రై చేస్తే దాని ఆరోగ్య ప్రయోజనాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి, వీలైనంత వరకు తక్కువ నూనెతో వండటం మంచిది. ఇక గొర్రె మాంసం వండేటప్పుడు పైన కనిపించే తెల్లటి కొవ్వును తొలగించి, తక్కువ నూనెతో బ్రేజింగ్, గ్రిల్లింగ్ లేదా పులుసు రూపంలో వండుకుంటే కొవ్వును అదుపు చేయవచ్చు.
గుండె జబ్బులు, బిపి, కిడ్నీ సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు తమ ఆహారంలో ఎంత పరిమాణంలో మాంసం తీసుకోవాలో డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు నిర్ణయించుకోవడం మంచిది.