మీకు తెలుసా..? సాయంత్రం 4 గంటల తరువాత పండ్లను తినొద్దు.. ఎందుకంటే...

First Published Sep 3, 2021, 3:01 PM IST

 పండ్లలోని ప్రయోజనాలు అన్నీ మీరు పొందాలంటే పండ్లు తినడానికి ఓ నిర్థిష్ట సమయం ఉంటుంది. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. పండ్లను సూర్యాస్తమయం తరువాత తినడం వల్ల  ప్రయోజనాలు ఉండవంటున్నారు పోషకాహార నిపుణులు. 

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కుగా ఉంటాయి. రోజుకు రెండుసార్లు తాజా పండ్లను తింటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా తినడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీ అవయవాలు తమ పనిని తాము సమర్ధవంతంగా నిర్వహించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 

మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని పండ్లను అదేపనిగా ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చా..? అంటే కూడదు అనే చెబుతున్నారు. పండ్లలోని ప్రయోజనాలు అన్నీ మీరు పొందాలంటే పండ్లు తినడానికి ఓ నిర్థిష్ట సమయం ఉంటుంది. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. పండ్లను సూర్యాస్తమయం తరువాత తినడం వల్ల  ప్రయోజనాలు ఉండవంటున్నారు పోషకాహార నిపుణులు. 

లైఫ్‌స్టైల్, వెల్‌నెస్ కోచ్ ల్యూక్ కౌటిన్హో ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అది సూర్యాస్తమయానికి ముందు పండ్లు ఎందుకు తినాలో తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఆయుర్వేదం, ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం ప్రకారం, సాయంత్రం పండ్లు తినడం వల్ల నిద్ర షెడ్యూల్‌కు, జీర్ణ ప్రక్రియకు భంగం కలుగుతుందని ల్యూక్ అందులో రాసుకొచ్చాడు.

పండ్లలో ఎక్కువగా సాధారణ పిండి పదార్థాలు ఉంటాయి. అవి విచ్ఛిన్నం అవుతాయి. అందుకే వెంటనే ఎనర్జీని ఇస్తాయి. అంతేకాదు పండ్లు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. సూర్యాస్తమయం అంటే నిద్రపోయే సమయానికి దగ్గరగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా, సూర్యాస్తమయం తర్వాత మన జీవక్రియ మందగిస్తుంది. కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడం కష్టమవుతుంది. కాబట్టి, కార్బ్ తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.

పండ్లు తినడానికి సరైన సమయం ఏదీ అంటే.. ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఉత్తమం. రాత్రి దాదాపు 10 గంటల ఉపవాసం తర్వాత మన కడుపు ఖాళీగా ఉంటుంది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించి, జీవక్రియను ప్రారంభించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్లను కూడా భోజనంలో చేర్చాలి లేదా భోజనం చేసిన వెంటనే తీసుకోవాలి. 

పండ్లు తినడానికి సరైన సమయం ఏదీ అంటే.. ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఉత్తమం. రాత్రి దాదాపు 10 గంటల ఉపవాసం తర్వాత మన కడుపు ఖాళీగా ఉంటుంది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించి, జీవక్రియను ప్రారంభించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్లను కూడా భోజనంలో చేర్చాలి లేదా భోజనం చేసిన వెంటనే తీసుకోవాలి. 

ఏదైనా పండు తినడానికి ముందు భోజనం తర్వాత కనీసం 3.5 నుండి 4 గంటల వరకు వేచి ఉండాలి. సాధారణ కార్బోహైడ్రేట్లు ఉదయం, వ్యాయామానికి ముందు తరువాత తీసుకోవడం మంచిది. కొవ్వు, ప్రోటీన్, తక్కువ కాంప్లెక్స్ పిండి పదార్థాలు సూర్యాస్తమయం తర్వాత తీసుకోవడం ఉత్తమం.

పండ్లును ఎప్పుడూ విడిగానే తీసుకోవాలి. పాల ఉత్పత్తులు లేదా కూరగాయలతో కలపకూడదు. పాల లేదా కూరగాయలతో పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడవచ్చు. పండ్లు సరిగా జీర్ణం కాకపోవడం, పోషకాలను తక్కువగా గ్రహించడం వల్ల ఇది జరుగుతుంది. శరీరంలో టాక్సిన్స్ ఉండటం వల్ల అనారోగ్యం, ఇతర ఆరోగ్య సంబంధిత పరిస్థితులకు దారితీస్తుంది.

click me!