వంటల్లో ఈ ఆరు ఆకుకూరలు వాడితే... రుచి, వాసన అమోఘం..

First Published | Sep 3, 2021, 2:26 PM IST

 ఈ ఆకుకూరలు వాసన, రుచిని అందిస్తాయి. అధిక యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆహారానికి తాజాదనాన్ని చేకూరుస్తాయి. ఈ ఆరురకాల హెర్బ్స్  పాక, ఔషధ ఉపయోగాలు రెండూ కలిగి ఉన్నాయి. వాటిల్లో ఒరేగానో, పుదీనా, పార్స్లీ నుండి రోజ్‌మేరీ, థైమ్, కొత్తిమీర వరకూ ఉన్నాయి. 

healthy food

వంట చేసిన తరువాత చివర్లో వేసే కొత్తిమీరతో ఆ వంట రుచి, వాసన మారిపోతుంది. అద్భుతంగా తయారవుతుంది. వాసనకే కడుపులో ఆకలి కేకలు మొదలవుతాయి. కొంతమంది కొత్తిమీర ఇష్టపడరు. అయితే కొత్తిమీర ఒక్కటే కాదు.. ఆరు రకాల ఇలాంటి హెర్బ్స్  లేదా ఆకులను మీ వంటల్లో చేర్చడం వల్ల ఆ ఆహారానికి అద్భుతమైన రుచిని, సువాసనను చేర్చొచ్చు. 

వీటిల్లో చాలావరకు అన్నీ ఈ ఆకుకూరలు వాసన, రుచిని అందిస్తాయి. అధిక యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆహారానికి తాజాదనాన్ని చేకూరుస్తాయి. ఈ ఆరురకాల హెర్బ్స్  పాక, ఔషధ ఉపయోగాలు రెండూ కలిగి ఉన్నాయి. వాటిల్లో ఒరేగానో, పుదీనా, పార్స్లీ నుండి రోజ్‌మేరీ, థైమ్, కొత్తిమీర వరకూ ఉన్నాయి. అవేంటో.. చూడండి. 

Latest Videos


ఒరేగానో : దీంట్లో యాంటీఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. దీన్ని మనం ఎక్కుగా వంటల్లో నేరుగా ఉపయోగించం. మనలో చాలామంది ఎండిన ఒరేగానోను పిజ్జాలపై చల్లడం ద్వారా మాత్రమే తింటారు, కానీ తాజా ఒరేగానో  ప్రయోజనాలు సాటిలేనివి. తాజా ఒరేగానో కట్ చేసి పాస్తా, పిజ్జా, సూప్‌లు, సలాడ్‌లలో వాడవచ్చు. ఇక వంటలో ఒరేగానోను ఉపయోగించడం డిష్‌లో ఆ హెర్బీ రుచిని పొందడానికి సులభమైన మార్గం. 

పార్స్లీ : ఇది కొత్తిమీరలాగే ఉంటుంది. కానీ, పరిశీలించి చూస్తే, కొత్తిమీరకంటే చాలా భిన్నంగా ఉంటుంది. పార్స్లీని సాస్ లు, సూప్‌లు, సలాడ్‌లలో వాడొచ్చు. వండిన కూరల పైన కూడా కొత్తిమీరలాగా చల్లుకోవచ్చు. బంగాళదుంపలాంటి ఉడికించిన ఆహారపదార్థాలకు కూడా వీటిని కలపొచ్చు. పార్స్లీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. పార్స్లీలో ఉండే విటమిన్ ఎ, సి కంటి చూపు, ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 

రోజ్ మేరీ : అత్యధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్న మూలికల సమూహానికి చెందినది రోజ్‌మేరీ  అని మీకు తెలుసా? లాటిన్‌లో, రోజ్‌మేరీ అంటే 'సముద్రపు మంచు'. రోజ్మేరీని కూరగాయలు లేదా మాంసాలకు వండడానికి ముందు మారినేట్ చేసేప్పుడు కలిపితే బాగుంటుంది. రోజ్ మేరీని సన్నగా కోసి సూప్‌లు, వంటకాల్లో వాడుకోవచ్చు. రోజ్‌మేరీ రిఫ్రెష్ వాసనను ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. రోజ్‌మేరీకి బలమైన లావెండర్ లాంటి వాసన ఉంటుంది. అందుకే దీనిని అనేక సువాసనతైలాలు, ముఖ్యమైన నూనెలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 

పుదీనా : సాధారణంగా మన వంటగదిలో కనిపించే ఆకుకూర పూదీనా. దీనిని కూరల్లో ఒక ఇంగ్రీడియంట్ గా, రుచికోసం కలపడం లేదా.. పూర్తిగా పుదీనా తోనే రోటి పచ్చడి.. ఇలా పుదీనాను అనేక రకాలుగా వాడతారు. నాన్ వెజ్ లో పుదీనా వాడితే దాని రుచే మారిపోతుంది. టీకి కొన్ని పుదీనా ఆకులను జోడించడం వలన రిఫ్రెష్ గా ఉంటుంది. పుదీనా ప్రయోజనాలు మరిన్ని కావాలనుకుంటే పుదీనా ఆకులను కూడా పచ్చిగా నమలవచ్చు. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది. పుదీనా మీ ఆందోళనను శాంతపరుస్తుంది, అజీర్తిని నయం చేస్తుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 

థైమ్ :థైమ్ అనేది మధ్యధరా మూలిక, దీనిని ఇటాలియన్, ఫ్రెంచ్, మధ్యప్రాచ్య వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది మాంసం, సూప్‌లు, సాస్‌ల సీజన్‌కు సాధారణంగా ఉపయోగిస్తారు. థైమ్ అద్భుతమైన ఔషధ లక్షణాల కారణంగా చాలా ప్రజాదరణ పొందింది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మొటిమలను కూడా నయం చేస్తుంది. థైమ్ దగ్గు, గొంతు నొప్పి, కడుపు ఇన్ఫెక్షన్ చికిత్సకు కూడా ఉపయోగించబడుతుంది. ఈ హెర్బ్ నిమ్మకాయ, మసాలాల మిశ్రమ వాసన ఉంటుంది. అందుకే దీనిని సువాసనలు, నూనెలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 

కొత్తిమీర : అందరికీ ఇష్టమైన కొత్తిమీర. కొరియాండర్ అంటారు. కొత్తిమీర మనదేశంలో ఉపయోగించే అత్యంత సాధారణమైన గార్నిషింగ్ హెర్బ్. కూరలు, పప్పు లేదా సబ్జీలకు తాజాగా తరిగిన కొత్తిమీర ఆకులను చేరిస్తే.. వెంటనే రుచిని, వాసనను పెంచుతుంది. కొత్తిమీరలో సిట్రస్ తో కూడిన నట్టి వాసన ఉంటుంది. 

click me!