మరి, హోటల్స్ గదుల్లో సీసీ కెమేరాలు ఉన్నాయో లేదో ఎలా గుర్తించే ట్రిక్స్ కూడా ఉన్నాయి. మీరు రూమ్ లోకి వెళ్లగానే.. లైట్స్ అన్నీ ఆపేసి.. మొబైల్ ప్లాష్ లైట్ ఆన్ చేసి, అనుమానాస్పద వస్తువులపై ఫోకస్ చేయాలి. అక్కడ కెమేరా లెన్స్ ఉంటే.. మనకు తెలిసిపోతుంది. దీంతో పాటు.. మీరు మొబైల్ యాప్ లో లేదా ప్లే స్టోర్ లో లభించే హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ల ద్వారా కూడా గుర్తించవచ్చు.
తలుపు భద్రత – గ్లాస్ హ్యాక్
హోటల్ గది తలుపు తాళాలను కొన్నిసార్లు మాస్టర్ కీ ఉపయోగించి తెరవవచ్చు. దీనికోసం, రాత్రి పడుకునే ముందు, మీరు తలుపు హ్యాండిల్‌పై రెండు గాజు గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచాలి. ఎవరైనా బయటి నుండి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తే, ఆ గ్లాసులు కిందపడి పగిలిపోయి పెద్ద శబ్దం చేస్తాయి. దీనివల్ల మనం వెంటనే మేల్కొంటాము. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా, మీరు పెద్ద ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.