Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే రాత్రిపూట ఈ 5 చేస్తే చాలు.. సూపర్ రిజల్ట్స్!

Published : Jun 29, 2026, 05:30 PM IST

Hair Growth: నల్లని, ఒత్తైన జుట్టుకోసం అందరూ రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు పాటించే కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. అవేంటో, ఎలా పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
జుట్టు సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలు

నిపుణుల ప్రకారం.. జుట్టు ఆరోగ్యం మన రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు పాటించే కొన్ని సులభమైన హెయిర్ కేర్ అలవాట్లు జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడంలో, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మరి జుట్టు సంరక్షణ కోసం కచ్చితంగా పాటించాల్సిన ఆ నియమాలేంటో తెలుసుకుందామా..

26
సున్నితంగా దువ్వడం

రాత్రి పడుకునే ముందు జుట్టును సున్నితంగా దువ్వడం మంచి అలవాటు. రోజంతా జుట్టులో చిక్కులు, దుమ్ము, చెమట పేరుకుపోవచ్చు. బలంగా లాగకుండా వెడల్పాటి దంతాలున్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వితే చిక్కులు తగ్గుతాయి. దీనివల్ల ఉదయం జుట్టు విప్పేటప్పుడు తెగిపోవడం, రాలిపోవడం తగ్గుతుంది. 

36
తలపై మసాజ్

కొద్దిగా కొబ్బరి నూనె, బాదం నూనె లేదా మీకు నచ్చిన ఆయిల్ తో తలపై 2 నుంచి 5 నిమిషాల పాటు వేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. మసాజ్ వల్ల తల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది తల చర్మాన్ని రిలాక్స్ చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే అధికంగా నూనె రాసి రాత్రంతా ఉంచడం అందరికీ సెట్ కాకపోవచ్చు. ముఖ్యంగా చుండ్రు, ఇతర స్కాల్ప్ సమస్యలు వారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

46
వదులుగా జడవేయడం

పడుకునే ముందు జుట్టును చాలా బిగుతుగా కట్టకుండా, వదులుగా జడ వేయడం లేదా సాఫ్ట్ హెయిర్ బ్యాండ్‌తో కట్టుకోవడం మంచిది. చాలా బిగుతుగా పోనీటైల్ లేదా బన్ వేసుకొని పడుకోవడం వల్ల వెంట్రుకలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇది జుట్టు తెగిపోవడానికి లేదా హెయిర్ లైన్ బలహీనపడటానికి కారణం కావచ్చు.

56
దిండు కవర్

మీరు ఉపయోగించే దిండు కవర్ కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాటన్ పిల్లో కవర్లు కొంత ఘర్షణను కలిగిస్తాయి. ఫలితంగా జుట్టు చిక్కులు పడటం, పొడిబారడం లేదా తెగిపోవడం వంటివి జరగవచ్చు. అందుకే చాలామంది నిపుణులు సిల్క్ లేదా శాటిన్ పిల్లో కవర్లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇవి జుట్టుపై ఘర్షణను తగ్గించడంలో సహాయపడతాయి. 

66
మంచి నిద్ర

శరీరంలోని అనేక కణాల మాదిరిగానే వెంట్రుకల ఆరోగ్యానికి కూడా తగినంత విశ్రాంతి అవసరం. నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి అంశాలు కొందరిలో జుట్టు రాలడాన్ని పెంచవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర శరీర పునరుద్ధరణకు, హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది. ఈ 5 అలవాట్లతో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ఆహారంలో తగినంత ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D, బయోటిన్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories