చాలా మంది వోడ్కా కేవలం ప్లెయిన్ ఆల్కహాల్ అనుకుంటారు. కానీ, దీని తయారీ వెనక పెద్ద ప్రక్రియే ఉంది. వోడ్కాను ఎక్కువ శాతం పిండి పదార్థాలు , చక్కెర కలిగిన ధాన్యాలైన గోధుమలు , రై , బార్లీ , మొక్కజొన్న తో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బంగాళాదుంపలు , ద్రాక్ష పండ్లు నుండి కూడా తయారు చేస్తారు. వీటిని ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత మరబెట్టి వడపోసే ప్రక్రియ ద్వారా అత్యధిక ప్యూరిటీ కలిగిన ఆల్కహాల్‌గా మారుస్తారు. ఇందులో సాధారణంగా 40% ఆల్కహాల్ ఉంటుంది.
2. వోడ్కాలో నీళ్లు లేదా సోడా ఎందుకు కలపరు?
విస్కీ, బ్రాందీ లేదా రమ్‌లలో నీళ్లు, సోడా లేదా ఐస్ క్యూబ్స్ కలపడం చూస్తుంటాం. కానీ వోడ్కా విషయంలో మాత్రం చాలామంది నేరుగానే తాగుతుంటారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వోడ్కా అనేది అత్యంత శుద్ధి చేసిన ఆల్కహాల్. నీళ్లు లేదా సోడా ఎక్కువగా కలిపితే దాని అసలైన ఘాటు, ఫ్లేవర్, కిక్ తగ్గిపోతాయి. యూరప్‌లో వోడ్కాను బాగా చల్లబరిచి, ఎలాంటి మిక్సింగ్ లేకుండా ఒక్కసారిగా 'షాట్' కొట్టడమే అసలైన పద్ధతిగా భావిస్తారు. అయితే, ఆధునిక పార్టీ కల్చర్‌లో దీనిని క్రాన్బెర్రీ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, స్ప్రైట్ లేదా టానిక్ వాటర్‌తో కలిపి రకరకాల కాక్టైల్స్ (Cocktails) రూపంలో కూడా విశేషంగా తాగుతుంటారు.