Bike Seat: మీరు గమనించే ఉంటారు.. చాలా కంపెనీలకు చెందిన బైక్ లకు వెనక సీటు చాలా ఎత్తుగా ఉంటుంది. చాలా మంది యువకులు ఇష్టంగా ఇలాంటి బైకులు కొంటూ ఉంటారు. ఇలా ఉండటం చాలా స్టైల్ అని అనుకుంటారు. కానీ దీని వెనక పెద్ద కారణమే ఉంది. అదేంటో చూద్దాం..
చాలా కంపెనీలకు చెందిన బైకులకు డ్రైవర్ సీటు కంటే.. వెనక కూర్చొనే సీటు కొంచెం ఎత్తుగా ఉంటుంది. యువకులకు బాగా నచ్చుతుంది. కానీ..వృద్ధులు ఆ బైక్ ఎక్కడానికి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా కూడా.. చాలా కంపెనీలు ఈ డిజైన్ లోనే బైక్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఇది స్టైల్ అనుకుంటారు. కానీ.. ఇలా వెనక సీటు అలా ఎత్తుగా పెట్టడం వెనక చాలా పెద్ద కారణమే ఉంది. ముఖ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా ఈ డిజైన్ సెలక్ట్ చేస్తారట.
23
కేవలం అందం మాత్రమే కాదు...
చాలా మంది ఎత్తైన వెనక సీటును స్పోర్టీ లుక్ తో ముడిపెడతారు. కానీ, ఈ డిజైన్ వాస్తవానికి బైక్ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బైక్ బ్యాలెన్స్ కోసం...
బైక్ బ్యాలెన్స్ కోసం కూడా ఇలాంటి డిజైన్ ని తయారు చేస్తారు. ముందు, వెనక చక్రాల మధ్య బ్యాలెన్స్ చేయడానికి ఈ డిజైన్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వెనక కూర్చొన్న వ్యక్తి సీటు పైకి ఉండటం వల్ల.. బైక్ బరువు బ్యాలెన్స్ అవుతుంది. దీని వల్ల.. బైక్ అదుపుతప్పడం, స్కిడ్ అవ్వడం లాంటి సమస్య చాలా తక్కువగా ఉంటుంది. స్పీడ్ గా వెళ్లినా కూడా బ్యాలెన్స్ తప్పే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు.. బైక్ వెనక కూర్చొన్న వ్యక్తికి రోడ్డు చాలా క్లియర్ గా కనపడుతుంది. నార్మల్ గా ఉన్న బైక్ లో అయితే.. వెనక కూర్చొన్న వ్యక్తికి రోడ్డు కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ బైక్ లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ప్రయాణం సౌకర్యంగా కూడా ఉంటుంది.
33
భద్రత కూడా చాలా ఎక్కువ...
బైక్ వెనక సీటు ఎత్తుగా ఉండటం వల్ల.. ప్రమాదాలు కూడా తక్కువగా జరుగుతాయట. అదెలాగంటే.. నార్మల్ గా సీటు ఉన్న బైక్ లకు అయితే.. కాళ్లు, డ్రెస్ చున్నీలు, చీర కొంగు లాంటివి చక్రంలో ఇరుక్కొని కిందపడే ఛాన్స్ ఉంది. అదే.. సీటు హైట్ గా ఉండటం వల్ల ఆ సమస్య కాస్త తక్కువగా ఉంటుంది. దీని వల్ల వెనక కూర్చొన్నవారు సేఫ్ గా ఉండొచ్చు. అదుపు తప్పి పడిపోయే అవకాశాలు తక్కువ. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే.. ఈ బైక్స్ లో వెనక కూర్చొనే వ్యక్తి ఎత్తైన సీటు పై కూర్చొన్నప్పుడు.. వారు సహజంగానే కాస్త ముందుకు వంగి కూర్చొంటారు. దీని వల్ల ఎరోడైనమిక్స్ తగ్గుతుంది. ముఖ్యంగా హైవే పై వేగంగా వెళ్తున్నప్పుడు బైక్ పై గాలి నిరోధకం తగ్గి, డ్రైవర్ హ్యాపీగా డ్రైవ్ చేయగలుగుతాడు.
సస్పెన్షన్ పనితీరు కూడా మెరుగ్గా ఉంది.
గరుకు రోడ్లు, గుంతలు లేదా స్పీడ్ బ్రేకర్ల మీద ప్రయాణించేటప్పుడు, ఈ సస్పెన్షన్ వ్యవస్థ వెనుక కూర్చున్న ప్రయాణీకుడిని కుదుపుల నుండి కాపాడుతుంది. ఎత్తైన సీటు ఈ వ్యవస్థకు పనిచేయడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది, దీనివల్ల ప్రయాణం సుఖవంతంగా ఉండటంతో పాటు నడుము నొప్పి కూడా తగ్గుతుంది.