హోలీ రోజున తెలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకుంటారు..?

First Published Mar 23, 2024, 3:59 PM IST

హోలీ సమయంలో వేసవి ప్రవేశం ప్రారంభమవుతుంది. కాబట్టి, తెల్లని బట్టలు ధరించడం ద్వారా,  వేసవి  వెచ్చదనం సమస్య నుండి విముక్తి పొందుతారు.

హోలీ పండగ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా రంగులు పూసుకుంటూ గడుపుతారు.  ఈ సంవత్సరం మార్చి 25, సోమవారం వస్తుంది. రంగులు లేదా గులాల్, వాటర్ బెలూన్, వాటర్ గన్ , పూలతో ఆడుకుంటూ స్నేహితులు , కుటుంబ సభ్యులతో జరుపుకునే సమయం ఇది. అయితే.. దేశవ్యాప్తంగా హోలీ పండగ రోజున చాలా మంది కామన్ గా..తెలుగు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు.


ప్రజలు హోలీ రోజున తెల్లని దుస్తులు ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, హోలీ ఆడటానికి ఉపయోగించే వివిధ రంగులు - ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, ఊదా, నీలం  వాడతారు. అవి తెలుపు రంగు మీద మరింత అందంగా కనపడతాయి. అనే కారణంతో వారు ఆ తెలుపు రంగు ధరించి ఉండొచ్చు. అదనంగా, హోలీ సమయంలో వేసవి ప్రవేశం ప్రారంభమవుతుంది. కాబట్టి, తెల్లని బట్టలు ధరించడం ద్వారా,  వేసవి  వెచ్చదనం సమస్య నుండి విముక్తి పొందుతారు.
 

తెలుపు రంగు సత్యం , శాంతికి చిహ్నం. హోలీ, హోలికా దహన్, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని హిందువులు నమ్ముతారు. రాక్షస రాజు హిరణ్యకశిపుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడు, సోదరి హోలిక, విష్ణువు అవతారమైన నరసింహుల కథ హోలీతో ముడిపడి ఉంది.

భారతీయ పురాణాల ప్రకారం, హిరణ్యకశిపుడు తనను ఏ మనిషి లేదా జంతువు చంపకుండా వరం పొందాడు, నిరంకుడిలా మారాడు. ప్రజలు తనను పూజించమని బలవంతం చేశాడు. అయితే, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు నిరాకరించాడు. కొడుకైనా సరే ప్రహ్లాదుడిని చంపేమని  హోలికను  కోరాడు. ఆమె ప్రహ్లాదుడిని ఓడిలో కూర్చొపెట్టుకొని నిప్పులో కూర్చుటుంది.
 


అయితే.. ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించాడు. విష్ణువు నరసింహ అవతారంలో దర్శనమిచ్చి అతన్ని రక్షించి హిరణ్యకశిపుని చంపుతాడు. అందువల్ల, తెల్లని బట్టలు ధరించడం స్వచ్ఛత, మంచితనం, శాంతి, సామరస్య భావాలను సూచిస్తుంది. ప్రజలు అన్ని చెడు జ్ఞాపకాలను మరచిపోయి, వారి పగను విడిచిపెట్టి, ప్రజలలోని మంచిని స్వీకరించడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. 

తెల్లటి వస్త్రం వ్యక్తిని మానసికంగా ప్రశాంతంగా , స్వచ్ఛంగా ఉంచుతుంది.అన్ని రకాల చింతలు , భయాలను దూరంగా ఉంచుతుంది. మీరు హోలీ నాడు ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ రోజును తాజాగా ప్రారంభించవచ్చు.

click me!