అబ్బాయిలకు ఇలాంటి అమ్మాయిలంటే పిచ్చి..!

First Published | Mar 23, 2024, 3:27 PM IST

అమ్మాయిల్లో అబ్బాయిలను ఆకట్టుకునే విషయాలు చాలానే ఉంటాయి. ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిలు అబ్బాయిలకు కనిపిస్తే వారితోనే లైఫ్ లాంగ్ ఉంటారు. వీళ్లను అస్సలు వదులుకోరు. 
 

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామి విషయంలో. అవును కొన్ని లక్షణాలున్న అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా చాలా ఇష్టం. ఇలాంటి వారు ఎదురైతే మాత్రం వారిని అస్సలు వదులుకోరు. ఎన్ని సమస్యలొచ్చినా వారితోనే నడుస్తారు. మరి అమ్మాయిల్లో అబ్బాయిలకు నచ్చే ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు

ఆడవారికి ఉన్నట్టే అబ్బాయిలకు కూడా ఆత్మవిశ్వాసం ఉన్న  అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఇలాంటి అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇలాంటి అమ్మాయిలను చూస్తే అబ్బాయిలకు బాధ్యతాయుతంగా, పరిణతి చెందిన అమ్మాయి అనే అభిప్రాయం కలుగుతుంది.
 


కమ్యూనికేషన్ విధానం

ఎలాంటి రిలేషన్ షిప్ కి అయినా సరే కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. కమ్యూనికేషనే ఇద్దరి మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే మంచి కమ్యూనికేషన్ ఉన్న అమ్మాయిల పట్ల అబ్బాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు. నచ్చిన అమ్మాయి ఇతరులతో ఎలా మాట్లాడుతుందో చూడాలంటే అబ్బాయిలకు తెగ ఇష్టం. 
 

కంటిచూపునకు కూడా ఎంతో పవర్ ఉంటుంది. ఒక్క కంటిచూపుతోనే ఎన్నో విషయాలను ఎదుటివాళ్లకు చెప్పొచ్చు. అందుకే అబ్బాయిలకు కళ్లతో మాట్లాడే అమ్మాయిలను బాగా ఇష్టపడతారు. 
 

ఉత్సాహంతో జీవితాన్ని గడపడం

కొంతమంది ఆడవారికి కొత్త పనులను చేసేంత ధైర్యం ఉండదు. అలాగే సాహసం కూడా చేయరు. ధైర్యం చేసి కొత్త పనులను చేసే, సాహసం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండే ఆడవారంటే మగవారికి చాలా ఇష్టం. ఇలాంటి అమ్మాయిలకు అబ్బాయిలు చాలా తొందరగా పడిపోతారు. 

విలువనివ్వడం

అబ్బాయిలకు ప్రధాన ఆకర్షణ స్త్రీ కనిపించే తీరుతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు ఆడవాళ్లు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారనేది కూడా అంతే ముఖ్యం. పురుషులు చెప్పేదాన్ని మెచ్చుకోవడం, పురుషులకు విలువనిచ్చే ఆడవాళ్లకోసం మగవారు వెతుకుతారు. వాళ్లకు కాబోయే భాగస్వామిలో ఈ లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. 

Latest Videos

click me!