40 దాటిన వారిలో మిల్లెట్స్ మీద ప్రేమ.. ఎందుకంటే...

First Published | Sep 6, 2021, 4:19 PM IST

కరోనా తరువాత మారుతున్న జీవనశైలిలో భాగంగా.. ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెరిగింది. దీనివల్ల తాము మిల్లెట్స్ తో రకరకాల ఆహారాలను తయారు చేయడం మీద దృష్టి పెట్టామని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ చెఫ్ లు పంచుకున్నారు. 

ఆరోగ్యం, ఫిట్‌నెస్ ల మీద పెరుగుతున్న చైతన్యం ఆహారం విషయంలో చాలా మార్పులను తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే హోటల్ యజమానుల పరిశీలనలోకి ఓ ఆసక్తికరమైన అంశం వచ్చింది. 40లు దాటిన తమ కస్టమర్ల నుంచి 'మిల్లెట్స్' వంటి ఆరోగ్యకరమైన ఆహారాలకు డిమాండ్ బాగా పెరిగిందని వారు తెలిపారు. 

కరోనా తరువాత మారుతున్న జీవనశైలిలో భాగంగా.. ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెరిగింది. దీనివల్ల తాము మిల్లెట్స్ తో రకరకాల ఆహారాలను తయారు చేయడం మీద దృష్టి పెట్టామని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ చెఫ్ లు పంచుకున్నారు. 

ఇక మిల్లెట్ల మీద ప్రేమ ఎంతగా పెరిగిపోయిందంటే.. ముడి లేదా రెడీ-టు-కుక్ మిల్లెట్ ప్యాక్‌లు రిటైల్ స్టోర్, మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్లను ముంచెత్తుతున్నాయి. అయినా కూడా  40 ఏళ్లు పైబడిన అతిథులు స్టార్ హోటల్ రెస్టారెంట్లలో మిల్లెట్ వంటకాల కోసం వస్తున్నారని హోటలియర్‌లు అంటున్నారు.

Latest Videos

ఈ చెఫ్స్ చెబుతున్నదాని ప్రకారం.. 40 దాటిన వారు ముందుగా తాము తినేది ఎంత వరకు ఆరోగ్యకరమైనదో అని ఆలోచిస్తున్నారు. ఆ తరువాత ఆరోగ్యకరమైన ఫుడ్ కోసం మొదటిసారి మిల్లెట్స్ ఫుడ్స్ ను ట్రై చేస్తున్నారు. ఆ తరువాత రెగ్యులర్ గా వాటికే అడిక్ట్ అవుతున్నారని అంటున్నారు. 

అయితే దీన్ని ప్రయత్నించాలంటే వారికి ముందు మిల్లెట్స్ ప్రయోజనాలు తెలిసి ఉండాలి, లేదా ఎవరిద్వారానైనా వినిఉండాలి. లేదా వివరించాలి.. అని జోడించారు. అదే యంగ్ స్టర్స్, వాళ్లు డాక్టర్ కోర్సులు చదువుతున్న వారైనా సరే మైదా వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని కూడా వీరు చెబుతున్నారు. 

అయితే చెన్నైలోని మరో ప్రముఖ చెఫ్ అభిప్రాయం ప్రకారం.. అక్కడ 25-40 ఏళ్లలోపు వ్యక్తులు తరచుగా మిల్లెట్ ఆధారిత వంటకాలకు తినడానికి అంతగా ఇష్టపడడం లేదు. వీరికి దీనిమీద ఆసక్తి కలిగించాలంటే.. ఆయా వంటకాలు మిల్లెట్స్ తో చేసినవి అని చెప్పకుండా రెగ్యులర్ పేర్లో చెప్పాలని అన్నారు. 

ఎలాగంటే...మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ బిర్యానీ అని కాకుండా.. ఇడ్లీ, దోశ, బిర్యానీ అని ఇలా మామూలు పేర్లు చెప్పాలని అంటున్నారు. వీటిని బఫెలో ఉంచడం వల్ల తప్పనిసరిగా వారు తింటారని అంటున్నారు. 

కొన్నిసార్లు ఇలా మెన్షన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మరో హోటల్ యజమాని చెప్పుకొచ్చారు. బాస్మతీ బియ్యంతో చేసే బిర్యానీకి, మిల్లెట్స్ తో చేసే బిర్యానీకి తేడా ఉంటుందని.. ఇది హోటల్ రెప్యూటేషన్ మీద దెబ్బ పడుతుందని అన్నారు. 

నిజానికి"మిల్లెట్స్ సూపర్ ఫుడ్. అందుకే దీన్ని బ్రాండ్ చేసి దానికి కొత్త పేరు పెట్టాలి" అని ఆయన అన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది చెఫ్ లూ పంచుకున్నారు మిల్లెట్ పేరును డిష్‌కు ప్రిఫిక్స్ చేయాలి.దాని ఆరోగ్య ప్రయోజనాలను కూడా వివరించాలి." అన్నారు.

ఆహారం విషయంలో ముందు కళ్లు నిర్ణయిస్తాయి. అవి ఆహారాన్ని చూసి బాగా తెలిసిన రంగు లేదా రూపంలో లేనట్లయితే వెంటనే దాన్ని తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. మిల్లెట్ స్పెషల్స్ రుచి తెలిసివారు.. ప్రత్యేకంగా అవి దొరికే రెస్టారెంట్లకు వెతుక్కుంటూ వెడతారు అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.  

మిల్లెట్లతో సమై పొంగల్, వరాగు అడై, ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పంలతో పాటు నూడుల్స్, పాస్తాలతో పాటు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. 

click me!