మగవాళ్లు తరచుగా అబద్దాలు ఎందుకు ఆడతారో తెలుసా.. ?

First Published | Sep 6, 2021, 2:54 PM IST

ఏదైనా తప్పు చేసినప్పుడు.. చేసింది తప్పు అని తెలిసినప్పుడు.. దానివల్ల ప్రమాదం జరుగుతుందని ఊహించినప్పుడు.. దాని నుంచి తప్పించుకోవడానికి అబద్ధం అనే ముసుగును వేసుకుంటారట. 

కొన్ని సార్లు పురుషులు తెగ అబద్దాలాడేస్తుంటారు. ఒక మాటకు ఇంకో మాటకు పొంతన ఉండదు. అబద్దం అని తెలిసిపోతుంటుంది. అయినా అబద్దాలు ఆడుతుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్దాలను ఆశ్రయిస్తారు. ఎందుకలా? ఇంతలా అబద్దాలు ఆడాల్సిన అవసరం వారికేంటి? అంటే.. దానికీ కారణాలున్నాయంటున్నారు..

ఏదైనా తప్పు చేసినప్పుడు.. చేసింది తప్పు అని తెలిసినప్పుడు.. దానివల్ల ప్రమాదం జరుగుతుందని ఊహించినప్పుడు.. దాని నుంచి తప్పించుకోవడానికి అబద్ధం అనే ముసుగును వేసుకుంటారట. 


పురుషులు అబద్ధం ఆడుతున్నారని తెలియడం వల్ల ఇంట్లో ముఖ్యంగా భాగస్వామితో గొడవలు, హై డ్రామా.. ఇదంతా తట్టుకోవడం కష్టంగా మారి.. ఎందుకిలే తలనొప్పి అనుకుని ప్రశాంతత కోసం అబద్దాలను ఆశ్రయిస్తారట. 

కొన్ని సార్లు గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని అబద్ధాలు ఆడుతుంటారు. అంతకు ముందు రిలేషన్ లో వాళ్ల మాజీ భాగస్వామి.. నిజాలు చెప్పినప్పుడు.. అరవడం, గొడవలకు దిగడం లాంటి చేదు అనుభవాల నేపథ్యంలో పురుషులు ప్రస్తుతం ఉన్న బంధంలో అబద్దాలు ఆడతారు. 

ఇంటిపనులు తప్పించుకోవడానికి కూడా అబద్దాలు ఆడేస్తుంటారు. నేటి రోజుల్లో పురుషులు కూడా ఇంటిపనిలో సాయం చేయడం తప్పనిసరి అయితే.. ఇది ఇష్టం లేక.. చేతకాక అబద్దాలవెనక దాక్కుంటారట. 

నిజాయితీగా ఓ విషయాన్ని చెప్పినప్పుడు మీరు బాగా డ్రమటిక్ గా స్పందించే.. మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకకూడా అబద్దాలు ఆడతారట.

మంచి అభిప్రాయం సంపాదించుకోవడానికి, అభద్రత నుంచి తప్పించుకోవడానికి కూడా పురుషులు అబద్ధాలు ఆడుతుంటారు. నిజం చెప్పడం వల్ల ఇబ్బందుల్లో పడతామని, ఎదుటివారి దృష్టిలో చెడు అవుతామనే భయంతో అబద్ధాలు ఆడతారు

పరిపక్వత లేకపోవడం వల్ల అబద్ధాలు ఆడతారు. పురుషుల్లో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఇలాంటి పనులకు దిగుతారు. 

అన్ని విషయాలూ కంట్రోల్ చేయాలని చూస్తారు. అందుకే నిజం చెప్పడం వల్ల కొన్ని విషయాల్లో తన కంట్రోల్ తప్పుతుందేమో అని అబద్ధాలు ఆడతారు. పరిస్థితుల్ని తారుమారూ చేయడం ద్వారా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. 

శృంగారం విషయంలో నేరుగా మాట్లాడలేక అబద్దాలు ఆడతారు. మిమ్మల్ని ముందుగా ముగ్గులోకి దించడానికి ఇలా అబద్దాలు ఆడుతుంటారు. ఇది పురుషుల్లో చాలా సహజంగా కనిపించే లక్షణం అంటున్నారు నిపుణులు. 

Latest Videos

click me!