లేత గులాబీ రంగు పెదాల కోసం.. వంటింటి చిట్కాలు..

First Published Sep 6, 2021, 3:22 PM IST

ఈ ముదురు రంగును తేలిగ్గా తొలగించుకోవచ్చు. కొన్ని వంటింటి చిట్కాలతో వీటికి చక్కటి పరిష్కారం ఉంది. మీ ముదురు రంగు పెదాలను తేలికరంగులోకి మార్చి.. ఆరోగ్యంగా చేస్తాయి.

lips

లేత గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం అందరూ తహతహలాడతారు. పెదాలు మృధువుగా, లేద గులాబీరంగులో ఉండాలని కోరకుంటారు. అలా ఉన్న వారిని చూసి ఈర్ష్య పడతారు. ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. పెదాలు ముదురు రంగులో ఉండడం, లేదా పెదాల మూలల్లో నలుపు మీ ముఖం  అందాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. 

ఈ ముదురు రంగును తేలిగ్గా తొలగించుకోవచ్చు. కొన్ని వంటింటి చిట్కాలతో వీటికి చక్కటి పరిష్కారం ఉంది. మీ ముదురు రంగు పెదాలను తేలికరంగులోకి మార్చి.. ఆరోగ్యంగా చేస్తాయి. అలాంటి చిట్కాల్లో కొన్ని... 

ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని పెదాల చుట్టూ ఉండే నల్లటి ప్రదేశాల్లో రుద్దాలి. నిద్రపోయే ముందు ఇలా రుద్దుకుని రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేయాలి.

ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పెదాలపై మసాజ్ చేయాలి. మసాజ్ చేశాక ఓ గంటపాటు అలాగే వదిలేసి.. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. 

పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇది పెదాల ఆరోగ్యానికీ చాలా మంచిది. ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని.. రెండింటిని కలిపి మెత్తటి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమంతో పెదాలను మసాజ్ చేసి కాసేపటి తరువాత కడిగేసుకోవాలి.
 

అలోవిరాలోని ఆరోగ్య లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పూర్తిగా ఔషధ విలువలు కలిగిన అలోవెరా పెదాల ఆరోగ్యానికీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పెదాల మీద రోజూ అలోవిరా జెల్ ను రాసుకోవడం వల్ల నలుపు పోయి లేతరంగులోకి మీ పెదాలు మారతాయి.

చర్మం నలుపును విరగ్గొట్టడంలో రోజు వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. దూదిని రోజు వాటర్ లో ముంచి పెదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదాల నల్లదనం తగ్గి గులాబీ రంగులోకి మారతాయి. 

ముదురు రంగు అంటే.. పెదాల డ్రై నెస్ వల్ల కూడా వస్తుంది. అందుకే పొడిబారిపోకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం నిత్యం పెదాలను కొబ్బరినూనెతో మాయిశ్చరైజ్ చేసుకోవడం వల్ల పెదాల పగుళ్లు తగ్గి.. నలుపు విరుగుతుంది. 

దోసకాయ రసం వల్ల పెదాల నలుపు విరుగుతుంది. రోజూ క్రమం తప్పకుండా కీరా రసంతో పెదాలను రుద్దుకోవాలి... ఇంకా మంచి ఫలితాలు కావాలంటే దోసకాయ రసంలో, అలోవెరా జెల్ కలిపి రాసుకుంటే బాగుంటుంది. 

click me!