ఆయుర్వేదంలో పూల చికిత్స.. వికసించే చర్మ సౌందర్యానికి ప్రతీక...

First Published Aug 13, 2021, 1:01 PM IST

ఆయుర్వేదం అంటేనే ఔషధ మొక్కలతో చేసే వైద్యం. అందులోనూ వేర్లు కాకుండా పూలు, పండ్లతో మాత్రమే చికిత్స చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. అంతేకాదు పండ్లు, పూలను సేకరించడం తేలి. వేర్లు సేకరించాలంటే మొక్క మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అదే పండ్లు, పూలు అయితే... మొక్కలు జరిగే హాని ఏమీ ఉండదు. అలాగని అన్ని మొక్కల పండ్లు, పూలతో వైద్యం చేయలేరు. 

ఆయుర్వేదంలో ఓ అద్భుతమైన ప్రక్రియ పువ్వులతో చేసే చికిత్స. కొన్నిరకాల ఔషధ లక్షణాలున్న పూలతో అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయవచ్చు. అంతేకాదు ఆయుర్వేదం కేవలం మనుషులకే కాదు ప్రకృతిలోని అన్ని జీవజాతులమీద సానుభూతి, దయ చూపిస్తుంది. అందుకే మొక్కలనుంచి సేకరించి పువ్వులు, పండ్లతో చికిత్స చేయడం దీనికి ఉత్తమ మార్గంగా చెబుతారు.
undefined
ఆయుర్వేదం అంటేనే ఔషధ మొక్కలతో చేసే వైద్యం. అందులోనూ వేర్లు కాకుండా పూలు, పండ్లతో మాత్రమే చికిత్స చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. అంతేకాదు పండ్లు, పూలను సేకరించడం తేలి. వేర్లు సేకరించాలంటే మొక్క మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అదే పండ్లు, పూలు అయితే... మొక్కలు జరిగే హాని ఏమీ ఉండదు. అలాగని అన్ని మొక్కల పండ్లు, పూలతో వైద్యం చేయలేరు.
undefined
చర్మ సౌందర్యం కోసం, ఆరోగ్యం కోసం చర్మానికి వాడే ఏదైనా సరే దానికి ఆహారంగా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం పైన, లోపల ప్రభావితమవుతుంది. ఇక పువ్వులు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. సౌందర్య సాధనాలుగా వీటిని ఉపయోగించినప్పుడు, పండ్లు, పువ్వుల్లోని ప్రకాశవంతమైన రంగులు సహజ వర్ణద్రవ్యాలుగా పనిచేస్తాయి. అంతేకాదు, వీటివల్ల గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
undefined
కానీ, ఈ సుగుణాలు రసాయనిక ప్రక్రియలో అధిక వేడి, ఆక్సీకరణకు గురై తమ సహజ లక్షణాలను కోల్పోతాయి. దీంతోపాటు మిగిలిన కొద్ది ప్రయోజనాలు పొట్టలోని అమ్లాల వల్ల అందకుండా పోతాయి. అందుకే వీటి సుగుణాలను పూర్తిగా వాడాలంటే ఉత్తమమైన మార్గం, వాటిని పువ్వులు, పండ్లనుంచి నేరుగా తీసి వాడడమే. దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
undefined
పండ్లు, పువ్వుల్లో ఓలటైల్ ఎస్సెన్షియల్ ఆయిల్స్ చాలా ఉంటాయి. ఈ ఎస్సెన్షియల్ ఆయిల్సే తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి. వీటిల్ల పరాగసంపర్కం జరుగుతుంది. ఈ ఆయిల్స్ ముఖ్య ఉద్దేశ్యం అదే. అంతేకాదు ఈ ఎస్సెన్షియల్ ఆయిల్సే లేత పువ్వులను ఎండనుంచి దెబ్బతినకుండా కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అవి అద్భుతమైన యాంటీమైక్రోబయాల్స్, ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి నివారిస్తాయి.
undefined
ఎస్సెన్షియల్ ఆయిల్స్ చాలా సున్నితమైనవి.. వేడికి కరిగిపోతాయి, వాటి పరిణామంలో క్షీణత కనిపిస్తుంది. అంత ముఖ్యమైన ఎసెన్షియల్ ఆయిల్స్ ను సౌందర్య సాధనాలలో ఉపయోగించడం వల్ల మంచి సువాసనతో పాటు, చర్మ సంరక్షణలోనూ అద్భుతాలు జరుగుతాయి. చర్మకాంతి మెరుగుపడుతుంది. చర్మం సున్నితంగా, మృధువుగా, అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.
undefined
విటమిన్లు, ఖనిజాలు, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, పండ్లలో తక్కువ పీహెచ్ ఉంటుంది. పోషకాలు అధికంగా ఉండే జ్యూస్ లను చర్మం బాగా ఇష్టపడుతుంది. వీటివల్ల చర్మానికి మంచి పోషకాలు లభించడమే కాదు ఆరోగ్యంగా తయారవుతుంది. తక్కువ పిహెచ్ చర్మ టోన్‌ను సమం చేస్తుంది. చర్మానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది. రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
undefined
యాంటీఆక్సిడెంట్ చర్యలు, సెల్ టర్నోవర్ పెరగడం ద్వారా స్కిన్ టోన్‌ను కాంతివంతం చేస్తాయి. అంతేకాదు పువ్వులు శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పురాతన కాలం నుండి తాజా పండ్ల రసాలు ప్రజల ఆరోగ్యాన్ని, చర్మ కాంతిని సహాయపడతాయని చెబుతున్నదే. ఆధునిక పరిశోధన దీనిని నిర్ధారించింది. పూర్వ కాలంలో ప్రపంచవ్యాప్తంగా రాణులు, యువరాణులు.. తమ సౌందర్యం కోసం పువ్వులు, పండ్లను వాడేవారు.
undefined
భారతీయ రాణులు సౌందర్యసాధనాల్లో గులాబీలు, మల్లెలు, కుంకుమ పువ్వు ముఖ్యంగా ఉంటాయి. ఇక దీంతోపాటు నిమ్మకాయలు, బంతిపూలు అంతర్భాగంగా ఉంటాయి. పోర్చుగీసు వారు భారతదేశానికి బంతిపూలను పరిచయం చేసినప్పటి నుండి, వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల కోసం వాటిని సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. లోటస్ పిస్టిల్స్, కేసరాలు, ఆయుర్వేదంలో ముఖాన్ని సరిచేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. మందార రేకులు జుట్టు సమస్యలకు ఇంటి చిట్కాగా ఉపయోగిస్తారు.
undefined
click me!