శనివారం ఎవరికైనా ఉప్పు దానం చేస్తే ఏమౌతుంది?

First Published | Nov 29, 2024, 2:46 PM IST


శనివారం రోజున మనం ఎవరికైనా ఉప్పు దానం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం…

హిందూ శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి అంకితం చేశారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయస్వామి,  శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వరస్వామికి లాగా.. శనివారం శనీశ్వరుడికి అంకితం చేశారు.శనీశ్వరుడిని మెప్పిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. కొందరు కచ్చితంగా ఈరోజున నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. కొందరు శనీశ్వర ఆలయంలో నువ్వుల నూనె సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేస్తే.. శని వక్ర దృష్టి తప్పి, శుభాలు జరుగుతాయని నమ్ముతారు.  మరి, అలాంటి శనివారం రోజున మనం ఎవరికైనా ఉప్పు దానం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం…

salt

శాస్త్రాల ప్రకారం.. శనివారం రోజున మనం పొరపాటున కూడా ఎవరికీ ఉప్పు దానం చేయకూడదట. ఎవరికైనా ఉప్పు ఇస్తే… ఇంట్లో నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందట. ఇలా ఉప్పు దానం చేయడం అస్సలు శుభం కాదట.కేవలం ఉప్పు దానం చేయడమే కాదు.. ఈరోజున ఉప్పు కొనడం కూడా అంత మంచిది కాదట. ఇలా చేయడం వల్ల అశుభం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట.


salt

పొరపాటున మర్చిపోయి అయినా శనివారం పూట ఎవరికైనా ఉప్పు దానం చేస్తే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయట. తెలీకుండానే ఇంట్లో డబ్బు ఖర్చు అయిపోయి,  మన ఖర్చులకు కూడా లేకుండా పోతుందట.

కేవలం ఆర్థిక నష్టాలు మాత్రమే కాదు.. జీవితంలో ఊహించని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుందట. అప్పులు కూడా పెరిగిపోతాయట. అందుకే.. ఈ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. శనివారం రోజున ఉప్పు దానం చేయడం, కొనడం వల్ల శని ఆగ్రహానికి గురౌతారు. అందుకే..సమస్యలు ఎక్కువగా వస్తాయి.

Latest Videos

click me!