సాధారణంగా కోడి శరీరంలోని ప్రతి 30 నిమిషాలకు ఒక పసుపు సొన విడుదల అవుతుంది. అది ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ తెల్ల సొన, పెంకు ఏర్పడి గుడ్డుగా బయటకు వస్తుంది. అయితే, కొన్నిసార్లు కోడి శరీరం ఒకేసారి రెండు పచ్చ సొనలను విడుదల చేస్తుంది. అలా ఒకేసారి వచ్చిన ఆ రెండింటి చుట్టూ తెల్ల సొన, ఒకే పెండు కప్పుకోవడంతో.. ఇలా డబుల్ సొన గుడ్డు తయారౌతుంది.
ఎలాంటి కోడి.. ఇలాంటి గుడ్లు పెడుతుంది?
అన్ని రకాల కోళ్లు.. ఇలా డబుల్ సొన గుడ్లు పెట్టవు. కొత్తగా గుడ్లు పెట్టడం మొదలుపెట్టిన చిన్న కోళ్లలో హార్మోన్లు సరిగ్గా ఉండవు. అందుకే... ఇవి ఒకేసారి రెండు సొనలను విడుదల చేస్తాయి. అంతేకాదు, కొన్ని జాతి కోళ్లకు పుట్టుకతోనే డబుల్ సొన గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కోడి గుడ్లు పెట్టే సమయాల్లో తేడాలు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.