రెస్టారెంట్లలో ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార ఎందుకు కలుపుతారు?

Published : Oct 27, 2025, 11:05 AM IST

Leafy Vegetables: ప్రతి ఇంట్లోనూ ఆకుకూరలు వండడం సహజమే. వాటిని వండేటప్పుడు చిటికెడు చక్కెర ఎంతో మంది కలుపుతారు. రెస్టారెంట్లలో కూడా ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. ఎందుకో తెలుసుకోండి. 

PREV
14
చలికాలంలో ఆకుకూరలు

చలికాలం వచ్చేసింది. ఈ రోజుల్లోనే ఎక్కువగా ఆకుకూరలు మార్కెట్లో దొరుకుతాయి. ముఖ్యంగా పాలకూర వంటి ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్లో పుష్కలంగా ఉంటాయి. వీటితో చేసే ఆహారాలు కూడా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ ఆకుకూరలను వండేటప్పుడు రెస్టారెంట్లలో చిటికెడు చక్కెరను కలుపుతారు. ఇలా చేయడం వల్ల ఆకుకూరల్లో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసుకోండి.

24
చిటికెడు చక్కెర కలిపితే

పాలకూర వంటి ఆకుపచ్చని కూరగాయలు వండేటప్పుడు చిటికెడు చక్కెర జోడించడం వల్ల వాటి రంగు అలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఆకుపచ్చని ఆకుకూరలు వండుతున్నప్పుడు నలుపు రంగులోకి లేదా ఇంకా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది. అలా మారకుండా ఉండాలంటే చక్కెర కలిపితే సరిపోతుంది. రెస్టారెంట్లలో మీరు ఆర్డర్ చేసే ఆకుపచ్చని చట్నీలు, సూప్ లను చూడండి. అవి మంచి ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటాయి. దీనికి కారణం కొద్దిగా చక్కెరను జోడించడమే.

34
రుచి కూడా పెరుగుతుంది

ఆకుకూరల్లో చక్కెర కలపడం వల్ల రుచి కూడా సమతుల్యంగా మారుతుంది. ఆకుకూరల్లో ఉండే చేదు తగ్గిపోతుంది. పాలకూరలో కూడా కాస్త చేదు ఉంటుంది. ఆ చేదును సమతల్యం చేసే శక్తి పంచదారకు ఉంది. అలా అని మరీ ఎక్కువ చక్కెర వేయకూడదు. అప్పుడు కూర తీపిగా మారిపోయి సహజమైన రుచిని కోల్పోతుంది. చిటికెడు చక్కెర జోడిస్తే చాలు.

44
ముందే ఉడకబెట్టి

పాలకూర వంటి ఆకుకూరలను వండే ముందు ఒకటి నుంచి రెండు నిమిషాలు నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత వాటిని తీసి చల్లని నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల కూరగాయలు తమ ప్రకాశమంతమైన ఆకుపచ్చ రంగును కోల్పోకుండా ఉంటాయి. అలాగే రుచిని కూడా పెంచుతాయి. కర్రీ, చట్నీ, సూప్ ఇలా ఏం తయారు చేసినా కూడా ఈ చిట్కాను పాటించండి.

Read more Photos on
click me!

Recommended Stories