Sleep after Lunch: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపిస్తుంది ఎందుకు?

Published : Aug 10, 2026, 02:17 PM IST

Sleep after Lunch: మధ్యాహ్నం భోజనం చేశాక చాలా మందికి నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆఫీసులో ఎంత పని ఉన్న తెగ ఆవలింతలు వస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

PREV
13
మధ్యాహ్న భోజనం చేశాక నిద్ర

మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చాలా మందికి నిద్ర ముంచుకు రావడం జరుగుతూనే ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఆవలింతలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఆఫీసులో ఉంటే చైర్‌లో కూర్చున్న కాసేపటికి కళ్లు మూసుకుపోతాయి. కొందరు కునుకు తీసేస్తారు కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.

భోజనం తర్వాత నిద్రమత్తుగా అనిపించడాన్ని 'పోస్ట్-మీల్ డ్రౌజీనెస్' అంటారు. ఇదేమీ అనారోగ్యం కాదు. మన శరీర సహజ గడియారం, తిన్న ఆహారం, తిన్న పరిమాణం దీనికి కారణాలుగా చెప్పుకుంటారు. మధ్యాహ్న సమయంలో మన శరీరంలోని 24-గంటల సహజ గడియారం కొద్దిగా నెమ్మదిస్తుంది. అందుకే చాలామంది భోజనం చేయకపోయినా కాస్త మత్తుగా, బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు.

23
ఇలాంటి ఆహారాలు తింటే..

పొట్ట నిండా తింటే నిద్రగా అనిపించడం, బద్ధకంగా అనిపించడం జరుగుతుంది. పొట్ట నిండా తిన్నాక పండ్లు, లస్సీ, జ్యూస్‌లు కూడా తాగితే నిద్ర ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కేలరీలు, వేపుళ్లు, స్వీట్లు తిన్నప్పుడు నిద్ర మత్తు ఎక్కువగా అనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరంలో జీర్ణక్రియకు సంబంధించిన మార్పులు చాలా జరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్, ఇతర పోషకాల స్థాయిలలో మార్పులు వస్తాయి.

రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటే పగటిపూట నిద్ర వస్తుంది. అందుకే రాత్రిపూట తగినంత నిద్రపోవడం చాలా అవసరం.

33
నిద్ర రాకుండా ఈ చిట్కాలు

మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తు మరీ ఎక్కువగా ఉండి ఆఫీసు పనిచేయడానికి కష్టంగా మారితే చిన్న చిట్కాలు పాటించడి. మధ్యాహ్నం అతిగా కాకుండా మితంగా తినండి. తిన్న తర్వాత కాసేపు అటూ ఇటూ నడవండి. ఎక్కువగా నీళ్లు తాగండి. రాత్రిపూట సరిపడా నిద్రపోండి. ఒకవేళ ఈ సమస్య రోజూ వస్తుంటే, తల తిరగడం, నీరసం వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటే కొన్నిసార్లు రక్తహీనత , థైరాయిడ్, బ్లడ్ షుగర్ సమస్యల వల్ల కూడా ఇలా నిద్రమత్తు మధ్యాహ్నం పూట ఎక్కువగా రావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories