D Mart Prices: ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే..డీ మార్ట్ లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి?

Published : May 25, 2026, 06:55 PM IST

D Mart Prices:  ప్రస్తుతం చాలా సూపర్ మార్కెట్లు వెలిశాయి.  కిరాణా దుకాణాలు కూడా ఉన్నాయి.  కానీ..  ఈ కిరాణా స్టోర్స్  కన్నా కూడా తక్కువ ధరకే డీ మార్ట్ లో సరుకులు అమ్ముతూ ఉంటారు. ఇదెలా సాధ్యం..? దీని వెనక కారణం ఏంటి? 

PREV
14
డీమార్ట్ ధరలు..

మనలో చాలా మంది ప్రతి నెలా సరుకులు డీ మార్ట్ లోనే కొనుగోలు చేస్తూ ఉంటారు.  ఎందుకు అంటే… డీ మార్ట్ లో ధరలు తక్కువగా ఉంటాయి. ఇతర సూపర్ మార్కెట్లు, కిరాణా స్టోర్లతో పోలిస్తే.. ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. డీ మార్ట్ సంస్థ ఇంత తక్కువ ధరకు మనకు సరుకులు ఎలా ఇవ్వగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా తక్కువ ధరకు ఇవ్వడం వల్ల  డీమార్ట్ సంస్థకు లాభాలు ఎలా వస్తాయి? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

24
అద్దె భారం ఉండదు...

చాలా దుకాణాలు రోడ్ల పక్కన ఖరీదైన స్థలాలను అద్దెకు తీసుకుంటాయి. దీంతో అద్దెకే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కానీ డీ మార్ట్ మాత్రం సొంతంగా స్థలాన్ని కొనుగోలు చేస్తుంది. అందుకే వారికి అద్దె భారం ఉండదు.

అంతేకాదు,  సూపర్ మార్కెట్లు కంపెనీలు లేదా సప్లయర్ల నుంచి సరుకులు కొంటాయి. వీటికి ఒకటి, రెండు నెలల తర్వాత డబ్బు చెల్లిస్తాయి. కానీ డీమార్ట్ 7 నుంచి 10 రోజుల్లోనే డబ్బు ఇచ్చేస్తుంది. అందుకే  సప్లయర్లు  వీళ్లకు డిస్కౌంట్ ఇస్తారు.

34
భారీగా కొనుగోళ్లు.. మధ్యవర్తులు లేరు

డీమార్ట్‌కు భారతదేశం అంతటా బ్రాంచ్‌లు ఉన్నాయి. అందుకే వాళ్లు భారీ మొత్తంలో సరుకులను కొనుగోలు చేస్తారు. ఇక్కడ మధ్యవర్తులు ఉండరు, కమీషన్ కూడా ఉండదు. అందుకే డీమార్ట్‌కు చాలా తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి.

డీమార్ట్ తమ షాపుల్లో ఇంటీరియర్ డిజైన్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టదు. అంతేకాదు, కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు కూడా ఇవ్వదు. తక్కువ ధర, మంచి నాణ్యతతోనే కస్టమర్లను ఆకర్షిస్తుంది.

44
మంచి నాణ్యత.. నిత్యావసరాలే టార్గెట్

డీమార్ట్‌లో సింపుల్‌గా ఉండే మంచి నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ లగ్జరీ వస్తువులు ఉండవు. రోజూ వాడే వస్తువులు, కిరాణా సరుకులు తక్కువ ధరకే లభిస్తాయి. ఇవి తొందరగా అమ్ముడైపోతాయి, లాభం కూడా బాగా వస్తుంది. అందుకే, ఇతర స్టోర్స్ కంటే డీ మార్ట్ లో తక్కువ ధరకు సరుకులు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories