పాలిచ్చే తల్లులు సిట్రస్ పండ్లు తినకూడదా? నిజమెంత?

First Published Sep 2, 2021, 4:59 PM IST

కొత్తగా తల్లైన స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారం చుట్టూ అనేక అపోహలున్నాయి. వాటిలో చాలావరకు కేవలం తప్పుడు పుకార్లు మాత్రమే. వాటిలంలొ అత్యంత సాధారణమైన వాటిలో ఒకటి సిట్రస్ పండ్లను తినకూడదు అనడం. 

పాలిచ్చే తల్లులు సమతుల్య ఆహారం తీసుకోవడం తల్లికి, నవజాత శిశువు ఆరోగ్యానికీ చాలా అవసరం. అవసరమైన పోషకాలతో కూడిన ఆహారం తల్లుల త్వరగా కోలుకోవడానికి,  శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. సాధారణంగా, కొత్తగా తల్లైన స్త్రీ తన ఆహారంలో అన్ని రకాల పోషకాలను చేర్చాలి. దీనివల్ల తల్లీశిశువులకు విభిన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

కానీ, కొత్తగా తల్లైన స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారం చుట్టూ అనేక అపోహలున్నాయి. వాటిలో చాలావరకు కేవలం తప్పుడు పుకార్లు మాత్రమే. వాటిలంలొ అత్యంత సాధారణమైన వాటిలో ఒకటి సిట్రస్ పండ్లను తినకూడదు అనడం. 

సిట్రస్ పండ్లు ఎందుకు మంచివి కావు.. నవజాత శిశువు మొదటి ఆరు నెలలు తనకు కావాల్సి పోషకాలు, శక్తి కోసం తల్లిపాల మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. తల్లి ఏమైనా తింటే అది తల్లిపాలతో పాటు బిడ్డకు అందుతుంది. అందుకే, శిశువుకు అలెర్జీ లేదా జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతాయని నమ్ముతున్న ఆహారాలకు స్త్రీలు దూరంగా ఉంటారు. సిట్రస్ ఉన్న ఆహారాలతో కూడా అదే జరుగుతుంది. శిశువుల జీర్ణవ్యవస్థ అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో సిట్రస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమ్లత్వం ఏర్పడుతుంది.

ఇది నిజమేనా? ఆహారంలో సిట్రస్ పండ్లను తీసుకోకూడదా? అంటే సరైన సమాధానం లేదు. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శిశువు జాయింట్‌ని బలోపేతం చేయడానికి అవసరమైన పోషకం. మీరు చనుబాలిస్తున్నందు వల్ల మీ ఆహారంలో ఈ అద్భుతమైన పోషకాన్ని నివారించాల్సిన అవసరం లేదు. ఈ  పండ్లు పాలిచ్చే తల్లులకు చాలా మంచివి. మీరు వాటిని అలాగే ఒలుచుకుని తినవచ్చు లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు. కాకపోతే మరీ ఎక్కువగా తీసుకోకుండా చూసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ మీ శిశువు కడుపుని కలవరపెడితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి.

పాలిచ్చే తల్లులు నిజానికి సిట్రస్ పండ్లు బాగా తినాలి. ఎందుకంటే.. సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ ఉంది, అది మనల్ని ఆరోగ్యంగా, అనేక విధాలుగా ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. పాలిచ్చే తల్లలు రోజుకు రెండు సిట్రస్ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. 

సిట్రస్ పండ్లను ఇనుము అధికంగా ఉండే ఆహారంతో కలిపితే ఆహారం నుండి ఇనుమును బాగా పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఖనిజం తల్లుల్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, గర్భధారణ తర్వాత దానిని తీసుకోవడం వలన గర్భాశయాన్ని వేగంగా పూర్వ స్థితికి తీసుకురావచ్చు. 

సిట్రస్ పండ్లలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్‌లు, యాంటీబాడీలను అందించడం ద్వారా తల్లి, శిశువు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుందనే కారణంగా డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్‌లను నిరోధించవచ్చు. పండ్లలో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఫైబర్, నీటి కంటెంట్ అధికంగా ఉన్న సిట్రస్ పండ్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. తల్లిని హైడ్రేట్ గా ఉంచుతాయి.

నిజానికి ఏ ఆహారాన్ని తినొద్దు అంటే.. పాలిచ్చే తల్లి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే రెండూ పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తల్లిపాలిచ్చేప్పుడు పరిమితం చేయాల్సిన కొన్ని ఆహారాలు :
పాదరసం కలిగి ఉండే సీఫుడ్.
అధిక కెఫిన్ లేదా టానిన్
కారంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయండి
మద్యం తీసుకోవడం మానుకోండి

నిజానికి ఏ ఆహారాన్ని తినొద్దు అంటే.. పాలిచ్చే తల్లి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే రెండూ పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తల్లిపాలిచ్చేప్పుడు పరిమితం చేయాల్సిన కొన్ని ఆహారాలు :
పాదరసం కలిగి ఉండే సీఫుడ్.
అధిక కెఫిన్ లేదా టానిన్
కారంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయండి
మద్యం తీసుకోవడం మానుకోండి

click me!