కరీనా కపూర్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఇవే..

First Published Sep 2, 2021, 2:17 PM IST

కరీనా సుదీర్ఘకాలం మంచి యోగా అంబాసిడర్‌గా ఉన్నారు. యోగా వల్ల ప్రశాంతతతో పాటు,కరీనా ప్రసవానంతరం మళ్ళీ తన ఫిట్ నెస్ ను కొనసాగించడానికి మద్దతు ఇవ్వడం వరకు సాయపడింది. మీరు కూడా మీ దినచర్యలో యోగాను భాగం చేయడం వల్ల మంచి రూపంతో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.

బాలీవుడ్ ఫిట్ నెస్ ఐకాన్.. కరీనా కపూర్.. యమ్మీ మమ్మీ.. ఇద్దరు పిల్లల తల్లైనా మంచి ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటుంది కరీనా.. మరి కరీనా కపూర్ ఈ ఫిట్ నెస్ రహస్యాలేంటో తెలుసా.

కరీనా ఒకప్పుడు విపరీతమైన లావుగా ఉండేది. హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన తరువాత ఆమె తన బాడీమీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఊరికే వచ్చేసే ఒళ్లును కంట్రోల్ లో పెట్టడం అంత ఈజీ కాదు. అందుకే తన శరీరాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి కరీనా చాలానే కష్టపడింది. 

కరీనా కపూర్ దేశీ డైట్ సీక్రెట్స్, ప్రీనాటల్ డైట్ సీక్రెట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటినుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంతేకాదు కరీనా గురించి మరో రహస్యం ఏంటంటే.. ఆమె ప్రతీరోజూ క్రమం తప్పకుండా వర్క్ అవుట్స్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఆమె దీన్ని వదలలేదు. 

ఫిట్ నెస్ కోసం ఇంత కష్టపడుతుంది కాబట్టి బాలీవుడ్ లో కరీనాకపూర్ ట్రెండ్ సెట్టర్ గా మారింది. వ్యాయామాలు, డైట్స్ లతో పాటు కొన్ని చీట్ కోడ్స్ తో కూడా కరీనా చక్కటి ఫిగర్ మెయింటేన్ చేస్తూ.. తీర్చిదిద్దినట్టుగా.. ఫిట్ గా కనిపిస్తుంది. అవేంటో చూద్దామా.. 

కరీనా సుదీర్ఘకాలం మంచి యోగా అంబాసిడర్‌గా ఉన్నారు. యోగా వల్ల ప్రశాంతతతో పాటు,కరీనా ప్రసవానంతరం మళ్ళీ తన ఫిట్ నెస్ ను కొనసాగించడానికి మద్దతు ఇవ్వడం వరకు సాయపడింది. మీరు కూడా మీ దినచర్యలో యోగాను భాగం చేయడం వల్ల మంచి రూపంతో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.

పిలేట్స్, కిక్ బాక్సింగ్ లు కూడా ఆమె రోజువారీ వ్యాయామంలో భాగంగా ఉన్నాయి. కార్డియో, జిమ్ లు బరువు తగ్గడానికి శరీరాకృతిని మెరుగుపరచడానికి సాయం చేస్తాయి. అయితే ప్రతీసారి అవే కాకుండా కొత్త వ్యాయామాలు ట్రై చేయడం వల్ల శరీరం మంచి ఆకృతికి మారుతుంది. అందులో భాగంగానే కరీనా పిలెట్స్, కిక్ బాక్సింగ్ లను తన మెయింటనెన్స్ లో చేర్చింది. వీటివల్ల బిల్టప్ ఎనర్జీ విడుదలవుతుంది. 

కరీనా వర్క్ వుట్ పిక్స్ బాగా వైరల్ అవుతాయి. దీనికి కారణం కరీనా వేసుకునే ఔట్ ఫిట్స్.. మంచి కంఫర్టబుల్ గా ఉండే అవుట్ ఫిట్స్ వల్ల ఇంకా చక్కగా వ్యాయామం చేయడానికి మూడ్ సిద్ధమవుతుంది. దీనివల్ల వర్కవుట్ నల్లేరుమీద నడకలా సాగుతుంది. 

రెండుసార్లు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా కరీనా వర్కవుట్స్ ని వదిలిపెట్టలేదు. కడుపుతో ఉన్న సమయంలో ఖాళీగా కూర్చోవడం కాకుండా శరీరానికి వ్యాయామం తప్పనిసరి అని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చింది. వాకింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రెనింగ్.. అన్నీ చేయచ్చని.. చేసి మరీ చూపించింది కరీనా. 

స్నేహితులతో కలిసి వర్కవుట్స్ చేయడం నిజానికి చాలా బాగుంటుందని కరీనా అంటుంది. తను అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి వర్కవుట్లు చేసిన పిక్స్ పోస్ట్ చేస్తుంది తన పిల్లలతో కలిసి చేసినవి కూడా. ఇలా చేయడం వల్ల మనసు రిలాక్స్ అవుతుందని చెబుతారామె. 

వర్కవుట్స్ ఒక్కటే కాదు.. దానికి తగిన డైట్ తీసుకోవడం వల్లే వర్కవుట్స్ కంప్లీట్ అవుతాయని కరీనా నమ్ముతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫాట్స్, స్థానికంగా దొరికే తృణధాన్యాలు.. ఇలా అన్నీ తన డైట్ లో చేరుస్తారు. అలాగని డైట్ విషయంలో మరీ అంత స్ట్రిక్ట్ గా ఏమీ ఉండరు. 

click me!