సోంపు కలిపిన పాలు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...

First Published | Sep 22, 2021, 4:59 PM IST

పాలల్లో సోంపు కలపడం ఆరోగ్యానికి మంచిదా? ఆసక్తికరంగా, పాలు, సోంపు రెండూ విడివిడిగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండింటినీ కలపడం ప్రయోజనకరంగా ఉంటుందా? అంటే.. దీనికి పోషకాహార నిపుణులు చెప్పే సమాధానం... ఖచ్చితంగా ఉంటుంది అనీ...

పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, పాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎలా సహాయపడుతుందనే దాని గురించి చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నాం. అలాగే, ప్రతీ వంటింట్లోనూ ఓ సీక్రెట్ రెసిపీ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది. అలాంటి అతి ప్రాచీనమైన సీక్రెట్ ఇంగ్రీడియంటే సోంపు. దీన్ని డెజర్ట్‌లు, టీలు, రుచికరమైన వాటికి సున్నితమైన, తీపి రుచిని జోడించడానికి వాడతారు. ఈ సోంపుకు శక్తివంతమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది.
 

పాలల్లో సోంపు కలపడం ఆరోగ్యానికి మంచిదా?

ఆసక్తికరంగా, పాలు, సోంపు రెండూ విడివిడిగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండింటినీ కలపడం ప్రయోజనకరంగా ఉంటుందా? అంటే.. దీనికి పోషకాహార నిపుణులు చెప్పే సమాధానం... ఖచ్చితంగా ఉంటుంది అనీ... రోజూ మీరు తాగే పాలల్లో సోంపును కలపడం వల్ల దాని పోషకవిలువలు పెరగడమే కాకుండా, అనేక వ్యాధులను నయం చేస్తుందని, రాకుండా నివారించవచ్చని చెబుతున్నారు. 


milk

పాలు ఆరోగ్యకరమైన పాల కొవ్వులు, ఖనిజాలు, ప్రోటీన్‌ల గుణాలతో నిండినప్పటికీ, సోంపును కలపడం వల్ల దాని రుచి, పోషకావిలువలు మరింత పెరుగుతాయి. 

జీర్ణశక్తిని మెరుగుపరచడం నుండి జీవక్రియను పెంచడం వరకు కంటి చూపు, శ్వాసకోశ ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వరకు, సోపు-పాల మిశ్రమం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా సోంపు పాలను చేర్చండి. 

సోంపు-పాలు జీర్ణక్రియను ఎలా మెరుగుపరుస్తాయి?
తరాలుగా సోంపు మన భారతీయ వంటింట్లో స్థానం దక్కించుకుంది. భోజనం తరువాత సోంపును తినడం ఇప్పటికీ అలవాటే. సోంపును నమలడం వల్ల లాలాజలంలోని జీర్ణ రసంతో కలిపి ఆ తర్వాత విడుదలయ్యే నూనెలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. వాస్తవానికి, సొంపులో ఉండే ఈ నూనెలు వల్లే జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను స్రవించడంలో సహాయపడతాయి.

ఆసక్తికరంగా, పాలు కూడా జీవక్రియను పెంపొందించడంలో బాగా పనిచేస్తాయి. సో.. సోంపుతో కలిసిన పాలు జీర్ణశక్తిని మరింత పెంచుతాయి. పొట్ట సంబంధిత రుగ్మతలను మెరుగుపరుస్తుంది.

ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం ఉండటం వలన ఇది అత్యంత ఆరోగ్యకరమైన సహజ పానీయంగా మారుతుంది. దీనికి సోంపు కలపడం వల్ల పానీయానికి మరింత ఆరోగ్యకరంగా తయారువుతుంది. సోంపులో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాల మెరుగుదలతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

దృష్టిని మెరుగుపరుస్తుంది : సోంపులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాల గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిశుక్లం, ఇతర దృష్టి సంబంధిత సమస్యలు రాకుండా,  తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద ఔషధాల ప్రకారం, విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం, ఎండుద్రాక్ష, సోంపులను పాలతో కలపడం వల్ల కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. 

శ్వాస సంబంధిత ఆరోగ్యానికి సోంపు-పాలు
సోంపు-మిల్క్ డ్రింక్ శ్వాస సంబంధిత సమస్యలను నయం చేస్తుంది, సోంపును పాలలో చేర్చడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయలేం, కానీ దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కాలానుగుణ వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఈ పానీయంలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉండటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడవచ్చు.

ఫెన్నెల్ మిల్క్ డ్రింక్ ఎలా తయారు చేయాలి?

సోంపు-పాలను తయారు చేయడానికి, మీరు 1 గ్లాసు పాలను మరిగించాలి. పాలు మరిగేటప్పుడు 1 టీస్పూన్ సోంపు గింజలను అందులో వేయాలి. ఒకసారి చేసిన తర్వాత సోంపులోని రసం పూర్తిగా పాలలోకి దిగేలా చూడాలి. ఆ తరువాత పాలను వడకట్టాలి.రుచికి తగినట్లుగా కొద్దిగా చక్కెర/ బెల్లం వేసి చిటికెడు దాల్చినచెక్క/ జాజికాయ వేసుకుని తాగేయాలి. 

Latest Videos

click me!