పోర్న్ వీడియోలతో వ్యాపారం.. రూ. కోట్లు సంపాదించిన ప్రేమ జంట.. చివరకు..

First Published | Sep 22, 2021, 3:06 PM IST

 పోర్న్ వీడియోలు తీయడంతోపాటు.. వాటిని మార్కెట్లో అమ్మడం కూడా వీరే చేసేశారు.  స్థానిక మార్కెట్‌తో పాటు, ఇది ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం


అశ్లీల కంటెంట్‌ను సృష్టించినందుకు , పంపిణీ చేసినందుకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను  ఇటీవల అరెస్టు  చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఎంత కలకలం రేపిందో కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుం దీనికి సంబంధించి అతడిపై కేసు నడుస్తోంది. ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడు. 

కాగా.. తాజాగా అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి థాయిలాండ్ లో వెలుగు  చూసింది. ఓ జంట పోర్న్ సినిమాలతో డబ్బులు సంపాదిస్తున్నారు. కాగా.. తాజాగా వారిని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. వీరిని పోలీసులు ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి వ్యవహారమేంటో పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అశ్లీలత. అలాంటి కంటెంట్ (పోర్న్ కంటెంట్) గురించి ప్రపంచంలోని అన్ని దేశాలలో వివిధ చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది. భారతదేశంలో పోర్న్ చూడటంపై ఎలాంటి నిషేధం లేదు.  కానీ.. ఆ వెబ్ సైట్స్ ని మూసివేశారు. మన దేశంలో పోర్న్ ఫిల్మ్‌లను తయారు చేయడం  పంపిణీ చేయడం నిషేధం. ఆ నిషేధాన్ని అతిక్రమించినందుకే రాజ్ కుంద్రాపై కేసు. మరి ఈ థాయిలాండ్ కథేంటో చూద్దాం..

థాయిలాండ్ కి చెందిన ఓ జంట.. పోర్న్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. పోర్న్ వీడియోలు తీయడంతోపాటు.. వాటిని మార్కెట్లో అమ్మడం కూడా వీరే చేసేశారు.  స్థానిక మార్కెట్‌తో పాటు, ఇది ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం.. దీంతో.. ఈ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అమ్మయి వయసు 19ఏళ్లు కాగా.. అబ్బాయి వయసు 20 ఏళ్లు కావడం గమనార్హం. వీరిద్దరూ లవర్స్.
 

కాగా.. బ్యాంకాక్‌కు దక్షిణాన ఉన్న సముత్ ప్రాకాన్ ప్రావిన్స్‌లోని హోటల్‌లో సెప్టెంబర్ 20 రాత్రి  వీరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు ఆ మహిళను గతంలో విచారణకు పిలిచారు, కాని వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

ఈ జంట అశ్లీల కంటెంట్‌ను తయారు చేసి, దాని నుండి భారీగా డబ్బు సంపాదించారని  పోలీసులు ఆరోపిస్తున్నారు. సభ్యత్వ రుసుము కోసం పోర్న్ సినిమాలు చూడటానికి అనుమతించే వారిపై కేసు పెట్టవచ్చని అక్కడ రూల్ ఉంది. ఆ విషయం తెలిసినా వీరు ఇలాంటి వ్యాపారం చేయడంతో వీరిని అరెస్టుచేయక తప్పలేదు. 

వీరు చేసిన నేరం రుజువైతే తక్కువలో తక్కువ కనీసం మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

Latest Videos

click me!