White hair: ఈ పండ్లు తింటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..

Published : May 28, 2022, 02:01 PM IST

white hair: కొన్ని రకాల పండ్లను తినడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు అవి తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.   

PREV
16
White hair: ఈ పండ్లు తింటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..

ఒకప్పుడు వయసు మీద పడుతున్న వారికే జుట్టు తెల్లబడేది. ఇప్పుడు కాలం మారింది. చిన్న వయసు వారు సైతం తెల్లజుట్టు బారిన పడుతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతుంటారు. కొంతమంది తెల్లజుట్టురు రంగులేసి నల్లగా మారుస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ రంగు కొన్ని రోజులకే పోయి మళ్లీ జుట్టంతా తెల్లగా మారుతుంది. ఇలా కాకూడదంటే.. మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 
 

26

ఎందుకంటే.. మీ శరీరంలో కొన్ని రకాల పోషకాల లోపం ఏర్పడినప్పుడు కూడా జుట్టు తెల్లగా మారుతుంది. ఇంతకీ ఎలాంటి పండ్లను తింటే తెల్ల జుట్టు నల్లగా మారుతుందో తెలుసుకుందాం పదండి. 

36

నారింజ (Orange): నారింజ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే వారానికి రెండు మూడు సార్లైనా ఈ పండును తినడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల్లోనే  తేడాను గమనిస్తారు. 
 

46

నిమ్మకాయ (lemon): వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సీజన్ లో లెమన్ వాటర్ తాగడం వల్ల వేసవి దాహం తీరడంతో పాటుగా.. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఈ పండులో విటమిన్ సి తో పాటుగా.. మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడతాయి. 

56

చిలగడదుంప (Sweet potato): చిలగడదుంప మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ముఖ్యమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా దీనిలో బీటీ కెరోటిన్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే గరుకుగా, బలహీనంగా ఉండే వెంట్రుకలను కూడా బలంగా, షైనీగా తయారుచేస్తుంది. 
 

66

ఈ మూడు రకాల పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా ఎన్నో రోగాలు సైతం దూరమవుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories