మైసూర్ పాక్ లో రకాలు...
క్రాంచీ/ట్రెడిషనల్ మైసూర్ పాక్: గుల్లగా, చిన్న చిన్న రంధ్రాలతో కొద్దిగా గట్టిగా ఉంటూ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
సాఫ్ట్/నెయ్యి మైసూర్ పాక్: ఆధునిక కాలంలో ప్రాచుర్యం పొందిన ఈ రకంలో నెయ్యి మోతాదు ఎక్కువగా ఉండి, వెన్నలాంటి మెత్తదనంతో నోట్లో వేస్తే జారిపోతుంది. దీనినే మిల్క్ మైసూర్ పాక్ అని కూడా ఈ రోజుల్లో పిలుస్తున్నారు.
ఇంట్లోనే మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలి..?
శనగపిండి (Besan): 1 కప్పు( ముందుగానే జల్లించి పెట్టుకోవాలి..)
నెయ్యి: 2 నుండి 3 కప్పులు
పంచదార: 2 కప్పులు
నీళ్లు: 1 కప్పు
యాలకుల పొడి లేదా బేకింగ్ సోడా: చిటికెడు
తయారీ విధానం:
శనగపిండి వేయించడం: ఒక పాత్రలో అర కప్పు నెయ్యి వేడి చేసి, అందులో జల్లించిన శనగపిండి వేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు 8–10 నిమిషాలు చిన్న మంటపై వేయించి పక్కన పెట్టుకోండి.
పాకం పట్టడం: మరొక మందపాటి పాత్రలో పంచదార, నీళ్లు పోసి కరిగించండి. లేత ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించండి.
కలపడం & నెయ్యి చేర్చడం: పాకం వచ్చాక మంట తగ్గించి, వేయించి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పాలి. ఆ తర్వాత మిగిలిన వేడి నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ తిప్పుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరపడి, బాణలి అంచులను వదులుతూ పైన చిన్న బుడగలు వచ్చినప్పుడు దించేయాలి.
ముక్కలుగా కోయడం: నెయ్యి రాసిన ఒక ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, 10-15 నిమిషాలు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో చతురస్రాకారంలో ముక్కలుగా కోసుకుంటే అద్భుతమైన రాయల్ మైసూర్ పాక్ రెడీ అయినట్లే. కాకపోతే.. ఈ స్వీట్ రుచిగా రావాలంటే నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది. అప్పుడే రుచి వస్తుంది.