Coconut Capital: భారతదేశపు కొబ్బరి క్యాపిటల్ ఏదో తెలుసా? కేరళ అనుకుంటే పొరపాటు పడినట్లే..!

Published : Nov 14, 2026, 03:26 PM IST

Coconut Capital: కొబ్బరికాయకీ భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. దేశ వ్యాప్తంగా లభించే ఈ కొబ్బరికాయలకు స్పెషల్ గా మన దేశంలో రాజధాని కూడా ఉంది. అది ఏంటో తెలుసా?

PREV
13
కొబ్బరి రాజధాని..

ఉదయాన్నే దేవుడికి కొట్టే కొబ్బరికాయ నుండి మధ్యాహ్నం భోజనంలోని కొబ్బరి పచ్చడి, సాయంత్రం దాహం తీర్చే లేత కొబ్బరి బోండం వరకు..భారతీయుల జీవన శైలిలో కొబ్బరికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే, మనకు కొబ్బరికాయ అనగానే కేరళ రాష్ట్రం గుర్తుకు వస్తుంది. కొబ్బరి అక్కడే ఎక్కువగా పండుతుంది అనుకుంటాం. కానీ, కేరళ కాకుండా.. మన దేశంలో కొబ్బరి రాజధాని ఒకటి ఉంది.. అదేంటో , ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటో చూద్దాం...

23
భారతదేశపు కొబ్బరి రాజధాని...

దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం నేడు దేశంలోనే అత్యధికంగా కొబ్బరిని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా అవతరించింది. ఈ రాష్ట్రంలో కొబ్బరి తోటలు, అనుకూలమైన వాతావరణం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అనుసరించడం వల్ల కర్ణాటకకు ఈ ఘనత దక్కింది.

కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు, హాసన్, మాండ్య, మైసూర్, ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్ మంగళూరు జిల్లాల్లో దేశంలోనే అత్యధికంగా కొబ్బరి పండుతుంది. తాజా లేత కొబ్బరి బోండాలు, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె తయారీ వంటి ఉత్పత్తులకు కర్ణాటకకు పెట్టింది పేరు.

33
కర్ణాటక కొబ్బరి రాజధానిగా ఎలా మారింది?

కేరళలో దాదాపు ప్రతి వంటకాన్ని కొబ్బరికాయ తోనే చేస్తారు. కదా.. మరి కేరళను దాటి కర్ణాటక రాజధానిగా ఎలా మారింది అనే సందేహం చాలా మందిలో ఉండొచ్చు. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. కర్ణాటకలో కొబ్బరి పండటానికి అనుకూల వాతావరణం, సారవంతమైన నేలలు ఉన్నాయి. ఇక్కడ ఈ పంట పండించే విధానంలోనూ చాలా పద్ధతులు అనుసరిస్తారు. ఇక్కడ అధిక దిగుబడి కూడా వస్తుంది.

కర్ణాటకలో సాధారణ కొబ్బరి నూనెతో పాటు వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఎండు కొబ్బరి పొడి , కొబ్బరి పాలు, పర్యావరణ హితమైన పీచు ఉత్పత్తులు భారీ స్థాయిలో తయారవుతున్నాయి. ఈ పరిశ్రమలు వేలాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.

మరి ఏ నగరాన్ని 'కోకోనట్ క్యాపిటల్' అని పిలుస్తారు? 

రాష్ట్రాల పరంగా కర్ణాటక అగ్రస్థానంలో ఉంటే, నగరాల విషయానికి వచ్చేసరికి తమిళనాడులోని పొల్లాచ్చి నగరానికి 'కోకోనట్ సిటీ' లేదా 'కోకోనట్ క్యాపిటల్' అనే గుర్తింపు ఉంది. కోయంబత్తూరు జిల్లాలో ఉన్న పొల్లాచ్చి.. ఎటుచూసినా పచ్చని కొబ్బరి తోటలు, పీచు పరిశ్రమలు, దేశంలోనే అతిపెద్ద కొబ్బరి వ్యాపార మార్కెట్‌లకు ప్రసిద్ధి చెందింది.

కర్ణాటక ఎందుకు నంబర్-1 గా కొనసాగుతోంది?

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా దేశంలో ప్రధాన కొబ్బరి ఉత్పత్తిదారులుగా ఉన్నప్పటికీ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి, విస్తరిస్తున్న లేత కొబ్బరి వ్యాపారం, బలమైన ప్రాసెసింగ్ పరిశ్రమల వల్ల కర్ణాటక అందరికంటే ముందుంది. అందుకే, కర్ణాటక రాష్ట్రం కొబ్బరికి కేరాఫ్ అడ్రస్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories