ఏ బల్బు వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందో తెలుసా?

First Published | Sep 11, 2024, 8:38 PM IST

కొంతమంది ఎల్ఈడీ బల్బులు వాడితే మరికొంతమంది ట్యూబ్లైట్లను వాడుతుంటారు. ట్యూబ్ లైట్ ఎక్కువ కాంతిని ఇస్తుంది. కానీ ఈ రెండింటిలో దేన్ని వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందో తెలుసా? 

కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వేయకుండా ఉంటారు. అవసరానికి మాత్రమే బల్బులను వాడుతుంటారు. అయితే కొంతమంది బల్బులను కూడా మారుస్తుంటారు.

కరెంట్ బిల్లు తక్కువగా రావాలని చాలా మంది ఎల్ఈడీ బల్బులను వాడుతుంటారు. మరికొంతమంది ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఈ ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు నిజంగా కరెంట్ బిల్లును తగ్గిస్తాయా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఎల్ ఈడీ బల్బులు, ఎల్ ఈడీ ట్యూబ్ లైట్లు నిజంగా విద్యుత్ ను ఆదా చేస్తాయి?

సాధారణ బల్బుల కంటే ఎల్ఈడీ బల్బులు 60 నుంచి 80 శాతం తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అలాగే ఇవి కాంతిని ఎక్కువగా ఇస్తాయి. అలాగే ఎక్కువ రోజులు పనిచేస్తాయి.

ఎల్ఈడి బల్బులు, ట్యూబ్ లైట్లు సాధారణ లైట్ల కంటే తక్కువ చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఇంటిని చల్లగా ఉంచుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ పై ఒత్తిడిని తక్కువగా కలిగిస్తాయి. 

ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు చాలా ఆకారాల్లో, లైటింగ్లో లభిస్తున్నాయి. ఇవి మన ఇంటిని కాంతింతో నింపేయడమే కాకుండా ఇవి మంచి డెకరేషన్ లా కూడా ఉపయోగపడతుంటాయి.

నిజానికి విద్యుత్ ఆదాకు ఎల్ఈడీ బల్బులే మంచి ఆప్షన్. ఎందుకంటే ఈ బల్బులు చాలా తక్కువ కరెంట్ ను వినియోగించుకుంటాయి. అలాగే ఎక్కువ రోజులు పనిచేస్తాయి. దీన్ని కొంటే బల్బులను పదే పదే మార్చాల్సిన అవసరం ఉండదు. 

Latest Videos


ఎల్ఈడీ బల్బ్, ఎల్ఈడీ ట్యూబ్ లైట్ మధ్య తేడా

ఎల్ఈడీ బల్బులను, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను ఒకేవిధమైన  టెక్నాలజీతో తయారుచేస్తున్నప్పటికీ..  కరెంట్ ను వినియోగించుకుని కాంతిని ఇచ్చే సామర్థ్యం రెండింటికీ భిన్నంగా ఉంటుంది. ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే వీటిని ఉపయోగించే వారికి కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. 

ఎల్ఈడీల బల్బులను ఈ రోజుల్లో చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇళ్ల నుంచి పరిశ్రమల వరకు ప్రతి ఒక్కరూ ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తున్నారు. ఎల్ఈడీ బల్బులు 2 వాట్ల నుంచి ప్రారంభమై 40 వాట్ల వరకు లభిస్తాయి. ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు 9 వాట్ల నుంచి 20 వాట్ల వరకు లభిస్తాయి.

ఎల్ఈడీ బల్బులు లేదా ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు.. ఏది వాడితే మంచిది? 

ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లలో ఏది మంచిదంటే.. ఇది మీ ఇంటి అవసరాన్ని బట్టి ఎంచుకోండి.  ఎల్ఈడీ బల్బుల కంటే ట్యూబ్ లైట్లే ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. కానీ ట్యూబ్ లైట్ల కంటే ఎల్ ఈడీ బల్బులు కాంతిని తక్కువగా ఇస్తాయి. 

అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక గదిలో 5 వాట్ల ఎల్ఈడి బల్బు ఉంటే అది 9 వాట్ ట్యూబ్ లైట్ కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. కానీ దీని వెలుతురు ట్యూబ్ లైట్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది.

తక్కువ వెలుతురు ఉంటే మీరు 5-5 వాట్ల ఎల్ఈడి బల్బులను వాడంచ్చు. అయితే ఇవి ట్యూబ్ లైట్ల కంటే ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. అయితే ఎల్ఈడి ట్యూబ్ లైట్ మాత్రం గదిని కాంతివంతంగా చేస్తుంది. 


మీ రూం చిన్నగా ఉంటే ఎల్ఈడీ ట్యూబ్ లైట్ ను వాడండి. అయితే బాత్రూమ్లో మాత్రం ఎల్ఈడీ బల్బు పెడితే సరిపోతుంది. సాధారణ బల్బులు, ట్యూబ్ లైట్లకు బదులుగా ఎల్ఈడీలను ఉపయోగిస్తే మీ కరెంటు బిల్లు చాలా తక్కువగా వస్తుంది. 

click me!