పీరియడ్స్ సమయంలో భార్యతో భర్త ఎలా ప్రవర్తించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

First Published Oct 29, 2021, 4:33 PM IST

మహిళలకు ప్రతి 28 రోజుల కొకసారి పిరియడ్స్ (Period) వస్తుంది. ఇది ఆడవారికి సహజంగా వచ్చే ప్రాబ్లమ్. ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు వారు నీరసంతో, నొప్పితో (Pain), చికాకుతో (Irritation) అసౌకర్యంగా (Uncomfortable) ఉంటారు. ఆ సమయంలో భర్త భార్యతో ఎలా ఉండాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

పిరియడ్ సమయంలో అధిక రక్తస్రావం (Bleeding) ద్వారా మహిళలకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఉన్నప్పుడు భర్త ఆమెతో సున్నితంగా (Sensitive) వ్యవహరించాలి. కఠినంగా ప్రవర్తించరాదు. ఆమె పరిస్థితి గమనించి ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
 

పీరియడ్స్ సమయంలో మహిళలు చికాకుగా ఉంటారు. అందుకు వాళ్లపై చిరాకు (Irritation) చూపించవద్దు. నిజానికి ఆడవాళ్లు ఆ సమయంలో చికాకు పడుతూ భర్తను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదు. పీరియడ్ సమయంలో ఆ చికాకు అనేది సర్వసాధారణం. దానిని అర్థం చేసుకుని ఆమెకు సహాయపడాలి. ఇంటి పనుల నుంచి తగిన విశ్రాంతి (Rest) కలిగించేలా చూడాలి.
 

పనుల్లో సహాయం (Help) చేయాలి. అదే సమయంలో ఆమెకు భర్తపైన మరింత ప్రేమ (Love) పెరుగుతుంది. ఇంతలా అర్థం చేసుకునే భాగస్వామి దొరికినందుకు ఆమె అదృష్టంగా భావిస్తుంది. ఇలా ఆమెకు సహాయపడటం ద్వారా ఆమె పిరియడ్స్ సమయంలో వచ్చే చికాకు తగ్గిపోతుంది.
 

పిరియడ్ (Period) సమయంలో ఇబ్బందిగా అనిపించే హార్మోన్స్ (Hormones) అసమతుల్యతల వలన మహిళ మూడ్ అనేక రకాలుగా నిరాశ పడుతుంది. కాబట్టి ఆ కలత నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. తనను బయటకు తీసుకెళ్లడం, మంచి ఫుడ్ తినిపించడం చేయడం ద్వారా ఆమె మూడ్ ను మార్చవచ్చు.
 

ముఖ్యంగా  పిరియడ్ సమయంలో కలయికలో పాల్గొనమని ఆమెపై ఒత్తిడి చేయరాదు. పిరియడ్ సమయంలో సెక్స్ (Sex) చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతారు. కానీ ఇద్దరి అంగీకారంతో మాత్రమే చేయాలి. ఆమెకు కలయికలో పాల్గొనుటకు ఇష్టం లేకపోతే  ఒత్తిడి (Pressure) చేయరాదు.

click me!