బ్రేక్ ఫాస్ట్ లో స్వీట్స్ తింటే ఏమౌతుంది..?

First Published | Oct 29, 2021, 3:48 PM IST

ఉదయాన్నే స్వీట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.  శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తుందట. ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయం చేస్తుందట.
 

sweets

స్వీట్స్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు.  ఇక స్వీట్స్ ఇష్టపడేవారు.. వాటిని రోజూ విపరీతంగా లాగించేస్తారు. అయితే.. కొందరు స్వీట్స్ తినడం మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. స్వీట్స్ తినడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

చాలా మందికి మధ్యాహ్నం లంచ్ తర్వాత.. కొంచెం అయినా.. స్వీట్ తినాలని కోరుకుంటారు. లంచ్ తర్వాత స్వీట్ తింటే.. చాలా సేపు నోరు తీయగా ఉంుటంది. అంతెందుకు మనం రెస్టారెంట్ కి వెళ్లినా సరే.. వాళ్లు.. లాస్ట్ లో డెసర్ట్స్ ఏమైనా కావాలని అడుగుతుంటారు. 


అలా కాకుండా.. ప్రతిరోజూ ఉదయాన్ని స్వీట్ తో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది..?  పొద్దు పొద్దునే స్వీట్ ఎలా తింటాం అని అనుకుంటున్నారా..? ఈ నేపథ్యంలో.. స్వీట్స్ ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఏం జరుగుతోందో.. గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా..

ఉదయాన్నే స్వీట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.  శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తుందట. ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయం చేస్తుందట.

అల్పాహారం కోసం డెజర్ట్‌లు
రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం చేయడానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది.  కాబట్టి ఆయుర్వేదం (ఆయుర్వేదం)లో, ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరానికి శక్తి అవసరం. ఏదైనా తీపి తినడం ద్వారా త్వరగా శక్తిని పొందగలరు. అల్పాహారం కోసం, మీరు సహజ చక్కెరతో కొద్దిగా స్వీటెనర్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉండేలా చూసుకోవాలి.
 

నిజానికి, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఏదైనా ఆహారం శరీరంలో గ్లూకోజ్ స్థాయిని ఎంత త్వరగా లేదా క్రమంగా పెంచుతుందో చూపే గణాంకం. సహజ చక్కెరలు కలిగిన ఆహారాలు నెమ్మదిగా శరీరానికి శక్తిని ఇస్తాయి. ఉదయాన్నే స్వీట్ తినడం వల్ల రోజంతా శరీరం చురుగ్గా ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడూ అలానే ఉంటుందట.
 

అల్పాహారంలో స్వీట్లు ఎందుకు తినాలి?
అల్పాహారం లో  స్వీట్లు తినడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, తీపి శరీరం త్వరగా శక్తిని ఇస్తుంది . గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది, రోజంతా మన శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది . శక్తి  లోపించడం, నీరసం లాంటివి జరగకుండా ఉంటాయి.
 

అల్పాహారం ఆరోగ్యానికి అవసరమైన భోజనం. అల్పాహారం మానేసిన వారు సరిగా పని కూడా చేయలేరు. దేనిమీదా ఏకాగ్రత కూడా ఉండదు. అల్పాహారం మానేయడం కూడా ప్రజల పని జీవితాలను ప్రభావితం చేస్తుంది.
 

అల్పాహారం ఆరోగ్యానికి అవసరమైన భోజనం. అల్పాహారం మానేసిన వారు సరిగా పని కూడా చేయలేరు. దేనిమీదా ఏకాగ్రత కూడా ఉండదు. అల్పాహారం మానేయడం కూడా ప్రజల పని జీవితాలను ప్రభావితం చేస్తుంది.
 

చాలా మంది అల్పాహారం చేయకుండా ఉండి.. మధ్యాహ్నం  ఒకేసారి భోజనం చేస్తుంటారు. అలాంటి వారిలో శక్తి మొత్తం తగ్గిపోయి బలహీనంగా తయారౌతారట. కాబట్టి.. అల్పాహారం మానేయడం అస్సలు చేయకూడదు. శరీరానికి అల్పాహారం చాలా ముఖ్యం.

అయితే.. స్వీట్స్ తింటే బరువు పెరగుతాము కదా.. వాటిని తినమని  చెబుతారేంటి అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే.. పూర్తిగా స్వీట్స్ తినమని చెప్పడం లేదు. చిన్న చాక్లెట్ , కుకీ లాంటివి తిని.. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవచ్చు. అయితే.. ఆ స్వీట్ తోపాటు కార్బ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. బరువు పెరగకుండా ఉండగలుగుతాం.

Latest Videos

click me!