Ghee Making: నెయ్యి కాచేటప్పుడు ఒక్క తమలపాకు వేయండి చాలు, ఎందుకో తెలుసా?

Published : May 24, 2026, 08:26 AM IST

Ghee Making: భారతీయ ఇళ్లల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది.  ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు అందులో చిన్న తమలపాకు వేస్తే ఎంతో మంచిది.  అసలు నెయ్యికి, తమలపాకుకు సంబంధం ఏంటి? తెలుసుకోండి.

PREV
14
నెయ్యిలో తమలపాకు ఎందుకు?

భారతీయుల వంటగదిలో నెయ్యి కచ్చితంగా ఉంటుంది.  నెయ్యిలో అనేది మన ఆహారం సంప్రదాయంలో భాగం అయిపోయింది.  నెయ్యిని వంటకాలకు రుచి, సువాసన పెంచడానికి వాడుతూ ఉంటారు. అయితే నెయ్యి రుచిని, సువాసనను పెంచేందుకు వాడేది తమలపాకు. నెయ్యి సలసల మరుగుతున్నప్పుడే ఒక తమల పాకును వేస్తారు. ఇది అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా. తమలపాకు వేయడం వల్ల నెయ్యి నాణ్యత, సువాసన పెరుగుతాయని మన పెద్దలు నమ్మేవారు.

తమలపాకులో సహజమైన సువాసన ఉంటుంది. దాంతో పాటు యాంటీబ్యాక్టీరియల్  గుణాలు ఉంటాయి. నెయ్యి కాచేటప్పుడు దీన్ని వేయడం వల్ల నెయ్యికి మంచి సువాసన వస్తుంది. మీగడ నుంచి వచ్చే పచ్చి వాసన కూడా పోతుంది. 

24
ఎప్పుడు తమలపాకును వేయాలి?

నెయ్యి బాగా మరిగాక చివరి దశలో తమలపాకును వేయాలి. అప్పుడు వేస్తేనే దాని సువాసన నెయ్యితో కలిసిపోతుంది. దీనివల్ల నెయ్యి వాసన మరింత తాజాగా ఉంటుంది. ఆ వాసన ఇల్లంతా వస్తుంది. నెయ్యి కాచేటప్పుడు విపరీతంగా నురుగు వస్తుంది. ఈ నురుగును నియంత్రించడానికి తమలపాకు సహాయపడుతుంది. ఇది నెయ్యికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇవ్వడమే కాకుండా, అది ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

34
తేమను తొలగిస్తుంది

నెయ్యిలో తేమ ఉండకూడదు. తేమ ఉంటే నెయ్యి త్వరగా చెడు వాసన వచ్చేస్తుంది. తమలపాకు వేయడం వల్ల  మిగిలిపోయిన కొద్దిపాటి తేమను పీల్చేసుకుంటుంది. దీనివల్ల నెయ్యి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

44
బంగారు రంగులో నెయ్యి

నెయ్యిలో తమలపాకు వేయడం వల్ల నెయ్యికి అందమైన బంగారు రంగు వస్తుంది. చూడటానికి బంగారంలా మెరిసిపోతుంది.  మన పెద్దలు పాటించిన ఇలాంటి చిన్న చిన్న సహజ చిట్కాల వెనుక కేవలం రుచే కాదు, సైన్స్, సంప్రదాయం కూడా దాగి ఉన్నాయి. అందుకే ఇప్పటికీ చాలామంది ఇళ్లలో నెయ్యి కాచేటప్పుడు తమలపాకు వేయడానికి ఇష్టపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories