Weight Loss tips : కొన్ని రకాల టీలు బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. అందులో మూడు రకాల టీలు కొవ్వును వేగంగా కరిగించడానికి ఎక్కువ కేలరీలు బర్న్ అయ్యేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వేగంగా శరీర బరువును పెంచొచ్చేమో కానీ .. బరువును మాత్రం అంత సులువుగా తగ్గించలేం. ఈ విషయం దాదాపుగా ఈ సమస్య బారిన పడిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. బరువు తగ్గడానికి అంకిత భావం, సమయం, సహనం, ఓపిక, హార్డ్ వర్క్ లాంటివి చాలా అవసరం.
27
పేలవమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, కొన్నిరకాల మెడిసిన్స్ ను ఉపయోగించడం, అనారోగ్య సమస్యలు మొదలైన కారణాల వల్ల బరువు పెరుగుతారు.
37
సులువుగా బరువు తగ్గడానికి ఎన్నో మార్గాలున్నాయి. కొందరు వ్యాయామం చేస్తే బరువు తగ్గితే మరికొంత మంది మాత్రం.. మంచి డైట్ ను ఫాలో అవుతూ బరువును తగ్గుతున్నారు.
47
అయితే బరువును తగ్గించడంలో టీలు, పానీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పలు పరిశోధనల ప్రకారం.. టీ లో కాటెచిన్లు (Catechins) అని పిలువ బడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరం కొవ్వును వేగంగా విచ్ఛిన్నం చేయడానికి మరియు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది" అని డైటీషియన్ సారా కోసిక్ చెప్పారు. ఇంతకు బరువు తగ్గడానికి సహాయపడే మూడు రకాల టీ లు ఏమిటో తెలుసుకుందాం పదండి.
57
cinnamon tea
దాల్చిన చెక్క (Cinnamon)టీ...
అధిక పోషక విలువలు కలిగిన దాల్చిన చెక్క(Cinnamon) టీ బరువు తగ్గడానికి మీకు ఎంతో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ జీవక్రియను పెంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి.
67
గ్రీన్ టీ (Green tea)...
బరువు తగ్గడానికి సాధారణంగా ఉపయోగించే టీ రకాల్లో గ్రీన్ టీ (Green tea) ఒకటి. గ్రీన్ టీ లో కాటెచిన్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతుంది. తద్వారా కొవ్వును కరిగించే రేటును పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికే కాదు కేలరీలను అధిక మొత్తంలో బర్న్ చేయడానికి ఎంత సహాయపడుతుంది.
77
బ్లాక్ కాఫీ (Black coffee)...
చక్కెర జోడించకుండా ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి బ్లాక్ కాఫీ (Black coffee) తాగడం వల్ల శరీరం నుంచి కొవ్వును తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కానీ కాఫీని మోతాదుకు మించి అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది.