Health Tips: యూజ్ చేసిన వంట నూనెను మళ్లీ ఉపయోగిస్తున్నారా? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?

Published : May 21, 2022, 10:40 AM IST

Health Tips: ఉపయోగించిన నూనెను తిరిగి మళ్లీ యూజ్ చేయడం వల్ల గుండె జబ్బులు, చిత్త వైకల్యం, అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధితో సహా  మరెన్నో రోగాలు చుట్టుకునే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

PREV
16
Health Tips: యూజ్ చేసిన వంట నూనెను మళ్లీ ఉపయోగిస్తున్నారా? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?

Health Tips: నూనె లేని వంట చేయడం కష్టమేనేమో కదా.. అలా అని మోతాదుకు నూనెను ఉపయోగించడం కూడా మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నూనెను ఎంత తక్కువగా వాడితే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కానీ చాలా మంది నూనె దగ్గర ఒక తప్పు చేస్తుంటారు. అదే ఉపయోగించిన నూనెను అది అయిపోయే వరకు తిరిగి మళ్లీ ఉపయోగిస్తుంటారు. ఏ వంటకానికి వాడినా.. దాన్ని మళ్లీ  ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

26

ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు, చిత్తవైకల్యం, అల్జీమర్స్ మరియు పార్కిన్సన్ వ్యాధితో సహా  ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇది ఆల్డిహైడ్లు వంటి అనేక ప్రమాదకరమైన సమ్మేళనాలను పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంది.
 

36

నూనెను తిరిగి వేడి చేసినప్పుడు, మరొక హానికరమైన అణువు కూడా విడుదల అవుతుంది:  అదే 4-హైడ్రాక్సీ-ట్రాన్స్-2  (HNE). ఇది విషపూరితమైనది. ప్రమాదకరమైనది కూడా.  DNA, RNA, ప్రోటీన్ విధులకు ఇది హానీ అంతరాయం కలిగిస్తుంది.

46

కార్సినోజెన్ అనేది శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి సహాయపడతే రసాయనం. తిరిగి వేడి చేసిన వంట నూనెలో పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (పిఎహెచ్), ఆల్డిహైడ్లు వంటి ప్రమాదకరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది శరీరంలో క్యాన్సర్, శరీర వాపు ప్రమాదాన్ని పెంచుతుంది.

56

అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెను వేడి చేసినప్పుడు, కొన్ని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్ గా మార్చబడతాయి.  పొగబట్టిన నల్ల నూనెను తిరిగి వేడి చేసినప్పుడు ఇది ఎక్కువ ట్రాన్స్ కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

66

అందుకే వంటలకుు చేయడానికి ఎల్లప్పుడూ ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించండి. ఒక సారి యూజ్ చేసిన దాన్ని మళ్లీ వాడితే ఇలాంటి రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. 
 

click me!

Recommended Stories