Propose Day 2022: ఏ రంగు గులాబీ తో ప్రపోజ్ చేస్తున్నారు..? ఏ కలర్ రోజ్ ఏం భావాన్ని సూచిస్తుందో తెలుసా?

First Published | Feb 8, 2022, 11:29 AM IST


Propose Day 2022:  ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నరోజు రానే వచ్చింది. ప్రొపోజ్ డే రాకతో చాలా మంది వన్ సైడ్ ప్రేమికులు తమ ప్రేమను చెప్పడానికి సిద్దమవుతుంటారు. మరి మీ ప్రేమను చెప్పడానికి ఏ కలర్ రోజ్ ను ఇద్దామనుకుంటున్నారు.

Propose Day 2022: లవర్స్ ఎంతగానో ఎదురుచూసే ‘Valentine's Day’ వీక్ రానే వచ్చింది. అందులోనూ ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. ప్రపోజ్ డే రాకతో.. చాలా మంది వన్ సైడ్ లవర్స్ తమ లవ్ ను చెప్పడానికి సిద్దమైపోతుంటారు. ప్రేమికులే కాదు..  పెళ్లైన జంటలు కూడా తమ భాగస్వామిని ఎంతలా ప్రేమిస్తున్నారో చెప్పుకుంటారు. అంతేకాదండోయ్.. స్నేహితులు కూడా వారి ప్రేమను తెలుపుకుంటారు. అయితే.. మీ ప్రేమను తెలియజేయడానికి ఏ కలర్ రోజా పువ్వును ఇవ్వాలనకుంటున్నారు. మీకు తెలుసా.. ఒక్కో కలర్ రోజా పువ్వు ఒక్కో భావాన్ని తెలియజేస్తుంది.

మనసుకు నచ్చిన వ్యక్తి మనముందరుంటే.. మాటలు కరువై పోతాయి. కేవలం చూపులే మన భావాలను బయటపెట్టగలుగుతాయి. కానీ ప్రపోజ్ చేసే సమయంలో ప్రియమైన వారి కళ్లలోకి చూడాలంటే.. ఒక రకమైన సిగ్గు, బిడియం వంటివి మన ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. దాంతో మన గుండె దడ ఓ రేంజో లో పెరిగిపోతుంది. అందుకే ఒకే ఒక్క రోజా పువ్వుతో.. మీ మనస్సులోని భావాలను చెప్పేయవచ్చు. కాబట్టి ప్రపోజ్ చేయడానికి ఒక గులాబీ పువ్వును ఎంచుకోండి. అయితే ఏ రంగు పువ్వు ఎలాంటి భావాలను సూచిస్తుందో తెలుసుకోండి.
 



వాలెంటైన్స్ డే రోజుల్లో ప్రపోజ్ డేకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకో తెలుసా.. ఇతర రోజుల కంటే ప్రపోజ్ డే నాడు తమ ప్రేమను వ్యక్తపరిస్తే.. వారి లవ్ సక్సెస్ అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా ఈ రోజు నో అనడానికి వీలుండదని చాలా మంది నమ్ముతుంటారు. కాబట్టి మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి ఒక అందమైన రోజా పువ్వును ఇచ్చి.. మీ మనస్సులోని ప్రేమను తెలియజేయండి. ఈ రోజు మీరిచ్చిన పువ్వు స్వీకరిస్తే ఇక మీకు  ప్రతి రోజూ పండగే.. మరి ఈ రోజ్ డే లేదా.. ప్రపోజ్ డే రోజున ఎలాంటి రంగు పువ్వు ఎలాంటి అర్థాన్నిఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రేమికుల రోజున ఎక్కువగా రెడ్, గులాబి, తెలుపు, పసుపు, నారింజ కలర్ గులాబీ పువ్వులనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అవతలి వ్యక్తి పట్ల మీకున్న ఫీలింగ్స్ ను బట్టే ఏ రంగు పువ్వు ఇవ్వాలన్నది డిసైడ్ చేసుకోవాలి. 
 

ఎల్లో రోజ్:  Yellow Rose ఫ్రెండ్ షిప్  చిహ్నంగా చెప్పుకుంటారు. ఒక వ్యక్తి పట్ల కేవలం మీకు స్నేహ పూరిత భావమే ఉన్నట్టైతే.. వారికి పసుపు రంగు గులాబీ పువ్వును ఇవ్వండి.


ఆరెంజ్ కలర్ రోజా పువ్వు:  ఆరెంజ్ కలర్ రోజా పువ్వులు అభిరుచికి, ఉత్సాహానికి చిహ్నాలు. అంతేకాదు ఈ పువ్వులు రొమాంటిక్ ఫీలింగ్ ను తెలియజేస్తాయి. అంతేకాదు మనద్దరి రిలేషన్ షిప్ కు నువ్వు సిద్దంగా ఉన్నావా అని భావం వ్యక్తం చేస్తాయట. అయితే ప్రపోజ్ డే రోజు ఎరుపు లేదా గులాబీ రంగు రోజా పువ్వులు అందుబాటులో లేకపోతేనే వీటిని ప్రత్నామాయంగా ఉపయోగిస్తారు.

Dark Pink Roses: Gratitude and Appreciation


గులాబీ రంగు:  రెడ్ రోజా పువ్వులు ధన్యవాదాలనుు తెలియజేస్తుంది. అంతేకాదు ఈ పువ్వులు సౌమ్యతను, దయను, ప్రశంసలను తెలియజేస్తాయి. కాబట్టి మీరు ఎవరికి ఈ గులాబీ రంగును పువ్వును ఎవరికి ఇవ్వాలనుకుంటారో డిసైడ్ చేసుకోండి.

Red rose

రెడ్ రోజ్: ప్రపోజ్ డే రోజు మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి ప్రపోజ్ చేయడానికి ఈ పువ్వును ఉపయోగించండి. ఈ రెడ్ రోజా పువ్వు శృంగారానికి, ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటారు. అంతేకాదు ఈ గులాబీ పువ్వు విష్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఈ రెడ్ రోజ్ కృతజ్ఞత, ఆనందం, దయ వంటి వాటిని కూడా సూచిస్తుంది. 

వైట్ రోజ్: తెలుపు రంగు స్వచ్ఛతకు ప్రతీక. ఈ వైట్ రోజెస్ అమాయకత్వాన్ని, స్వేచ్చను తెలియజేస్తుంది. మీ మనసుకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేయడానికి ఈ తెలుపు రంగు పువ్వును ఉపయోగించండి. అయితే ఈ పువ్వును కేవలం మీ లవర్ కు పెళ్లి ప్రపోజ్ చేయడానికి మాత్రమే ఉపయోగించండి.  
 

Latest Videos

click me!