Valentine’s Day 2022: ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్న బెంగుళూరు

First Published | Feb 8, 2022, 10:13 AM IST

Valentine’s Day 2022: ప్రేమ.. మాటల్లో చెప్పలేని ఒక గొప్ప భావన. మనసుకు నచ్చిన వ్యక్తి ఎదురైనప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ప్రేమలో ఖచ్చితంగా పడే ఉంటారు. ప్రేమించిన వారితో ఎన్నో అనుభవాలను మూటగట్టుకునే ఉంటారు. అయితే ప్రేమికులకు ఎంతో ఇష్టమైన.. అందమైన రోజు రానే వస్తోంది. ఫిబ్రవరి 14 కోసం ఎంతో మంది జంటలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఆ రోజు వెకేషన్ కు వెళ్లాలనుకునే వారికి బెంగుళూరు సూపర్ గా నచ్చుతుంది.
 

Valentine’s Day 2022: ప్రేమ ఒక మధురమైన అనుభూతి. మాటల్లో చెప్పలేని భావన.  ఆకర్షణతో మొదలై.. ప్రాణంగా మారుతుంది. ప్రేమించిన వారిపై అంతులేని ఇష్టం మొదలై వారి స్థానం మనసులో ఎన్నటికీ చెరిగిపోని విధంగా గూడుకట్టుకుంటుంది. ఇకపోతే ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ ఖచ్చితంగా పుట్టే ఉంటుంది. ఇక ప్రేమికుల రోజున ప్రేమను చెప్పలేని వారు చెప్పడానికి, ఒకరి ఉన్న ఇష్టాన్ని తెలియజేయజేయడానికి ఎంతో అనువైంది. ఇకపోతే ప్రేమికుల రోజు ఎంతో మధురంగా ఎన్నటికీ గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా జంటలు భావిస్తుంటాయి. అలాంటి వారికోసం బెంగుళూరు సాధరంగా ఆహ్వానం పలుకుతోంది. 
 

వాలెంటైన్స్ డే రోజున ప్రతి జంట ఏకాంతంగా గడపాలని ఆశపడుతుంటారు. అంతేకాదు.. ఎక్కడికైనా అందమైన ప్లేస్ కు వెళ్లి ఈ ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవాలని ముచ్చటపడుతుంది. అలాంటి వారికి బెంగుళూరు సూపర్ గా నచ్చుతుంది. అక్కడ ఎన్నో సుందర ప్రదేశాలుంటాయి. అంతేకాదు.. ప్రేమికులకు ఈ వెకేషన్ ఒక మంచి మెమోరీగా ఎన్నటికీ గుర్తుండి పోతుంది. అంతేకాదు మీరు ప్రపోజ్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అదే. మరి బెంగుళూరు వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకునే వారు అక్కడ ఎలాంటి ప్లేసెస్ కు వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.



అలివ్ బీచ్:  ప్రేమికుల రోజు ఎంత మధురంగా గడుస్తుందో కదా.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి జంట ఎంతో ఎంజాయ్ చేస్తుంది. అయితే బెంగుళూరు ప్రేమికులు మెచ్చే అద్బుతమైన వంటకాలు ఆలివ్ బీచ్ లో లభిస్తాయి. అంతేకాదు ఈ బీచ్ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కాగా ఈ బీచ్ బెంగుళూరులో అశోక్ నగర్ లో ఉంటుంది. ఇది ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాదు దీనిచుట్టూ ఎంతో విశాలమైన ప్లేస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ టేబుల్స్ అన్ని క్యాండిల్స్ లో వెలిగిపోతుంటాయి. ప్రేమికుల కోసం ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకెక్కడుంటుంది చెప్పండి.

నంది హిల్స్:  ప్రేమికులు ఎక్కువ సమయం ఏకాంతంగా గడపాలని ఆశపడుతుంటారు. అయితే బెంగుళూరులో నంది కొండలు బాగా నచ్చుతాయి. ఉదయాన్ని నంది కొండకలకు చేరుకుని ప్రేయసితో కలిసి సూర్యోదయాన్ని చూస్తూ మీ రోజును ప్రారంభించండి. అది మీకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇది బెంగుళూరు నుంచి 65 కి. మీ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళితే లాంగ్ డ్రైవ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. అంతేకాదు దైవదర్శనం చేయాలనుకుంటే మీకు అక్కడ శివాలయం కూడా ఉంటుంది. ఇంకేంటి అక్కడికి వెళ్లి మీ ప్రేమ కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి కోరండి.
 

ఉల్సూర్ సరస్సు:  ఈ నగరంలో ఎంతో సుందరమైన ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది ఉల్సూర్ సరస్సు అనే చెప్పాలి. మీ ప్రేయసి లేదా ప్రియుడితో కలిసి ఆ సరస్సులో బోటింగ్ చేస్తే .. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మీరు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా గుర్తుండిపోతుంది. అంతేకాదు అక్కడ అద్బుతమైన చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సంద్యా సమయంలో మీకు ఇష్టమైన వారితో ఈ బెంగుళూరు నగరం యొక్క అందాలను చూసేయొచ్చు.
 

పార్కు: ప్రేమికులకు ఎంతో నచ్చే ప్లేసెస్ లో పార్కు కూడా ఒకటి. అందుకే సమయం దొరికితే చాలు పార్కుల్లోకి వెళ్లి గంటల తరబడి సమయాన్ని గడిపేస్తుంటారు. ఇకపోతే బెంగుళూరులో కబ్బన్ పార్క్ ఎంతో ఫేమస్. ఈ పార్కులలో ఇష్టమైన వారితో అలా అలా నడవడం గొప్ప అనుభూతినిస్తుంది. ముఖ్యంగా ఈ కబ్బన్ పార్క్ బెంగుళూరుకు ఊపిరితిత్తుగా పేరుపొందింది. అంతేకాదు ఈ పార్కులో క్యూ పద్దతిలో ఉండే చెట్లు నడిచే వారికి కనివిందు చేస్తాయి. మీకు తెలుసా.. ఈ పార్క్  1870లో నే ఏర్పాటు చేశారు.  అప్పటి నుంచే ఈ కబ్బన్ పార్క్ నగరంలో అద్బుత భాగంగా పేరుపొందింది. 
 

Latest Videos

click me!