తలనొప్పిని నిమిషాల్లో తగ్గించే బెస్ట్ అమ్మమ్మ చిట్కా

First Published | Aug 16, 2024, 10:51 AM IST

తలనొప్పి కొన్ని కొన్ని సార్లు గంటలో తగ్గిపోతే కొన్ని సార్లు మాత్రం రోజంతా ఉంటుంది. తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.  కానీ ఇది మాత్రం అంత తొందరగా తగ్గదు. అయితే మీరు ఒక అమ్మమ్మ చిట్కాల ఫాలో అయితే మాత్రం వెంటనే తగ్గిపోతుంది. అదేంటంటే? 
 

ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చిట్కాలను ఫాలో అవుతుంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు మన అతి ఆలోచన, ఒత్తిడి, తీరికలేని పనుల వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో కామన్ గా వచ్చేది తలనొప్పి. ఈ తలనొప్పి వచ్చిందంటే నెత్తి పగిలిపోతుంది. ఎంతకీ తగ్గదు. కొన్ని కొన్ని సార్లైతే రోజులు కూడా ఉంటుంది. ఒత్తిడి, అలసటతో పాటుగా ఎన్నో కారణాల వల్ల తలనొప్పి వస్తుంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి కొంతమంది ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీకు ఎప్పుడూ తలనొప్పి వస్తుంటే దానికి కారణాలేంటో తెలుసుకోండి. నిజానికి తలనొప్పి వెనుక ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా కారణముంటాయి. అందుకే దీర్ఘకాలిక తలనొప్పి సమస్య ఉంటే హాస్పటల్ కు వెళ్లండి. తలనొప్పిని తగ్గించే మందులను తీసుకోవడానికి ముందు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి. అయితే ఒకటి అమ్మమ్మ చెప్పిన చిట్కా ఫాలో అయితే మాత్రం వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

తలనొప్పి తగ్గడానికి ఏ నూనె మంచిది?

లవంగం నూనె తలనొప్పిని తగ్గించడానికి ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనెకు బ్యాక్టీరియా కణాలను చంపే శక్తి కూడా ఉంటుంది. లవంగం నూనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. మీకు తలనొప్పి వచ్చినప్పుడు లవంగం నూనెను తలకు పట్టించి మసాజ్ చేయండి. ఇది మీ తలను చల్లగా చేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. 

Latest Videos


లవంగం నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇవి తలనొప్పిని వెంటనే తగ్గించడానికి బాగా సహాయపడతాయి. తలనొప్పి ఒత్తిడి వల్ల కూడా వస్తుంటుంది. అయితే ఈ లవంగం నూనెను వాడితే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందుకోసం నుదిటిపై ఈ నూనెను వృత్తాకార కదలికలో అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి.

Image: Freepik

లవంగం నూనెలో ఫ్లేవనాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి తలనొప్పిని వెంటనే తగ్గించడానికి సహాయపడతాయి. ఈ నూనె శరీర మంటను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నొప్పిని తగ్గిస్తుంది.  ఈ నూనెను మీరు మార్కెట్ లో కొనొచ్చు. లేదా ఇంట్లోనే తయారుచేయొచ్చు. 

ఇంట్లో లవంగం నూనెను ఎలా తయారుచేయాలి?

లవంగం నూనెను తయారుచేయడానికి 5 నుంచి 6 గ్రాముల లవంగాలను తీసుకుని గ్రైండ్ చేయండి. కొబ్బరి నూనెలో ఈ పొడిని వేయండి. అంతే ఈ నూనెను తలకు పట్టించి మసాజ్ చేయండి. ఈ నూనెతో తలను మసాజ్ చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. కావాలనుకుంటే మీరు లవంగాల పేస్ట్ ను అప్లై చేసినా.. తలనొప్పి తగ్గిపోతుంది. 

click me!