పురాణాల్లో రాఖీలు ఎవరు ఎవరికి కట్టారో తెలుసా?

First Published | Aug 15, 2024, 6:50 PM IST

రక్షాబంధన్‌.. అన్నాచెల్లెళ్లకు సంబంధించిన ఏకైక ప్రధాన పండగ. దీని కోసం అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మరి ఆ సమయం వచ్చేసింది. ఆగస్టు 19న రాఖీ పండగ చేసుకోవడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే అసలు రక్షాబంధన్‌ వెనుక ఉన్న ఆసక్తికర పురాణ కథలు, వాటిల్లో ఎవరు ఎవరికి రాఖీ కట్టారో తెలుసుకుందామా..
 

ద్రౌపదికి కృష్ణుడి వరం..

మహాభారత పురాణం ప్రకారం ఒకసారి కృష్ణుడు గాలిపటం(కైట్‌) ఎగరవేస్తున్నాడట. ఆ సమయంలో దారం తెగి కృష్ణుడి వేలు తెగిందట. రక్తం బాగా కారిపోతుండటంతో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర అంచు చించి అన్న వేలుకి కట్టిందట. సంతోషించిన కృష్ణుడు నీకు ఓ సోదరుడిగా అన్ని విధాలుగా సాయం చేస్తానని వరం ఇచ్చాడట.
 

సంతోషిమాత కథ..

శివ పురాణం ప్రకారం గణపతికి ఆయన చెల్లెలు ఓ సారి రక్షా బంధన్‌ కట్టిందట. అది చూసిన గణపతి కుమారులైన శుభ్‌, లాభ్‌ తమకు కూడా రాఖీ కట్టాలని ఉందని తెలిపారట. మాకు చెల్లి ఉంటే కట్టేవారిమని అన్నారట. అప్పుడు గణపతి తన దివ్యశక్తి ద్వారా ఓ బాలికను పుట్టించారట. ఆమె సంతోషి మాత. అప్పుడు శుభ్‌, లాభ్‌ సంతోషిమాతకు రాఖీ కట్టారని పురాణం చెబుతోంది.
 


మహాలక్ష్మికి బలి ఇచ్చిన వరం..

ఓ పురాణం ప్రకారం బలి చక్రవర్తి విష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడు.  సంతోషించిన విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఎప్పుడూ తన వద్దనే ఉండిపోవాలని బలి కోరాడట. దీంతో విష్ణువు రాకపోయే సరికి విషయం తెలుసుకున్న లక్ష్మీ దేవి బలి చక్రవర్తి వద్దకు ఓ పేద మహిళా వేషంలో వచ్చి ఏడుస్తూ ఉండట. ఏమైందని బలి అడగటంతో తనకు అన్న లేడని దుఖించింది. దీంతో బలి తననే అన్నగా భావించమని రాఖీ కట్టించుకున్నాడట. తర్వాత ఏం కావాలో కోరుకోమన్నాడట. దీంతో ఆమె నిజ రూపం ధరించి విష్ణువును తన వెంట పంపాలని కోరిండంతో  ఇచ్చిన వాగ్డానం మేరకు విష్ణువును పంపించడంతో వారిద్దరూ వైకుంఠానికి వెళ్లిపోయారట. 
 

ధర్మరాజు కూడా రక్షాబంధన్‌ కట్టుకున్నాడు...

మహా భారత యుద్ధ సమయంలో ధర్మరాజు చాలా ఆందోళనగా ఉన్నాడట. కృష్ణుడు దగ్గరకు వెళ్లి సైన్యాన్ని రక్షించాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పడు కృష్ణుడు అందరినీ రక్షాబంధన్‌ కట్టకోవాలని కోరాడు. దీంతో ధర్మరాజు కూడా రక్షాబంధన్‌ కట్టుకొని యుద్ధం రంగంలోకి దిగాడట. 
 

ఇంద్రుడికి రక్షాబంధన్‌..

ఓ పురాణం ప్రకారం దేవతలకు, రాక్షసులకు మధ్య  యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో తన భర్తను రక్షించమని ఇంద్రుడి భార్య ఇంద్రాణి భగవంతుడైన కృష్ణుడి వద్దకు వెళ్లింది. అప్పుడు కృష్ణుడు ఇచ్చిన రక్షాబంధనాన్ని ఇంద్రుడికి ఇంద్రాణి కట్టిందట. 
 

Latest Videos

click me!