Hug Benefits: సాధారణంగా ప్రేమలో ఉన్నవారే ఎక్కువగా కౌగిలించుకుంటారు. అది వాళ్లపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది. వారి లవర్ పై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేనప్పుడు ఇలా ఒక హగ్ రూపంలో చెప్పేస్తుంటారు. కౌగిలించుకోవడం వల్ల ప్రేమనే కాదు.. వారిపై ఉన్న నమ్మకాన్ని కూడా పెంచుతుంది. మీకు తెలుసా.. లవర్లకే కాదు, స్నేహితులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా ఈ హగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాధలో ఉన్నవారికి ఒకే ఒక హగ్ వారి బాధనంతా ఒక్క క్షణంలో దూరం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అందుకే చాలా మంది హగ్ ను దివ్య ఔషదంలా భావిస్తారు. ప్రేమను ఫీలవ్వడమే కాదు.. ఈ హగ్ ద్వారా ఓదార్పును కూడా పొందగలుగుతారు. ఒక్కో రకమైన హగ్ ఒక్కో అర్థాన్ని తెలియజేస్తుంది. కాగా కౌగిలించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.