గ్యాస్ స్టవ్ చుట్టూరా క్లీన్ చేయాలి
గ్యాస్ స్టవ్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదంటే దానిచుట్టూరా క్లీన్ చేసుకోవాలి. ఇందుకోసం గ్యాస్ స్టవ్ చుట్టూ ఉన్న కాగితపు తువాళు, దుస్తులు, పాత్రలను తీసేయాలి. వీటిని స్టవ్ కు దగ్గరగా ఉంచకూడదు.
మీరు స్టవ్ ను వాడుతున్నప్పుడు సరైన వెంటిలేషన్ ఉండాలి. దీనివల్ల బర్నర్లు సరిగ్గా పనిచేస్తాయి. గ్యాస్ స్టవ్ చుట్టూరా క్లీన్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేసుకోవడం ఈజీ అవుతుంది.
గ్యాస్ స్టవ్ బర్నర్లను ఎలా శుభ్రం చేయాలి?
బేకింగ్ సోడా, వెనిగర్ తో గ్యాస్ స్టవ్ బర్నర్ లను ఈజీగా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ఒక కప్పు బేకింగ్ సోడాలో 1/2 కప్పు వెనిగర్ ను పోసి కలపాలి. దీనితో బర్నర్లను శుభ్ర చేయడానికి ముందు గ్యాస్ స్టవ్ ను ఆఫ్ చేయండి.
ఇప్పుడు బేకింగ్ సోడా మిశ్రమాన్ని బర్నర్ హెడ్స్, క్యాప్స్ కు పెట్టండి. దీన్ని అర్థగంట పాటు అలాగే ఉంచి తర్వాత బ్రష్ తో క్లీన్ చేయండి. నీళ్ల కింద బర్నర్ లను క్యాప్స్ ను కడగండి. తర్వాత టవల్ లో తడి లేకుండా తుడిచి ఆరబెట్టండి.