పరిగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎన్నిలాభాలున్నాయో తెలుసా?

First Published | Jun 19, 2024, 11:04 AM IST

బీట్ రూట్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్నా, జ్యూస్ గా చేసుకుని రోజూ తాగినా ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పరిగడుపున బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

బీట్ రూట్ ను చాలా తక్కువ మంది తింటారు. ఎందుకంటే దీని టేస్ట్ రుచిగా ఉండదు. కానీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇద ఎన్నో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న కూరగాయ. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి బీట్ రూట్ జ్యూస్ ను రోజూ ఉదయాన్నే పరిగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

రక్తపోటును తగ్గిస్తుంది 

బీట్ రూట్ జ్యూస్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో సహజంగా లభించే నైట్రేట్స్ అనే సమ్మేళనం కూడా మెండుగా ఉంటుంది. ఇధి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. పరిగడుపున బీట్ రూట్ జ్యూస్ ను తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె  ఆరోగ్యం బాగుంటుంది. 
 

Latest Videos


రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బీట్ రూట్ లో విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. మీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే రోజూ పరిగడుపున బీట్ రూట్ జ్యూస్ ను తాగండి. ఇది మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. 
 

beetroot juice

జీర్ణక్రియను మెరుగుపరచండి

బీట్ రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే పరగడుపున బీట్ రూట్ జ్యూస్ ను తాగారంటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మీరు మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. ఈ జ్యూస్ ఎసిడిటీని కూడా నివారిస్తుంది. 
 

beetroot juice

కాలేయ ఆరోగ్యం

బీట్ రూట్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నైట్రేట్లు సమృద్ధిగా ఉండే బీట్ రూట్ జ్యూస్ ను పరిగడుపున తాగితే కాలేయం నుంచి విషపదార్థాలు బయటకు పోతాయి. అలాగే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

మెదడు పనితీరు మెరుగు

బీట్ రూట్ లో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో చిత్తవైకల్యం ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ మొత్తం మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 


రక్తహీనత

బీట్ రూట్ ఇనుము కు అద్భుతమైన మూలం. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం మంచిది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. 

బరువు తగ్గుతారు

బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపున తాగడం తాగితే శరీరంలో కొవ్వు కరగడం మొదలవుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బీట్ రూట్ జ్యూస్ ను తాగొచ్చు. 

 చర్మ ఆరోగ్యం

బీట్ రూట్ లో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి బీట్ రూట్ జ్యూస్ ను పరిగడుపున తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. 

click me!