Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువ ఉండాలా? లేక తక్కువగా ఉండాలా? వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే భార్యా భర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి? ఈ విషయంలో చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి.
తెలుగిళ్లల్లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి, అమ్మాయి వయసు గురించే మొదట అడుగుతారు. నిజానికి సమాజంలో అబ్బాయి వయసును పెద్దగా పట్టించుకోరు. అతని జీతం, ఆస్తులు మాత్రమే చూస్తారు. అమ్మాయి కన్నా అబ్బాయి కేవలం ఏడాది పెద్దయినా, పదేళ్లు పెద్దయినా పట్టించుకోరు. నిజానికి భార్యభర్తల మధ్య వయసు తేడా చూసుకుని పెళ్లి చేయడం చాలా ముఖ్యం. ఆచార్య చాణక్యుడు కూడా ఇదే విషయాన్ని తాను రాసిన నీతి శాస్త్రంలో వివరించారు. జంటల మధ్య సరైన ఏజ్ గ్యాప్ ఉంటే బంధంలో పరిపక్వత వస్తుందని, అవగాహన, గౌరవం, సహనం పెరుగుతాయని చాణక్యుడి నమ్మకం.
24
వయసు తేడా తక్కువగా ఉంటే
భార్యాభర్తల మధ్య వయసు తేడా తక్కువగా ఉంటే వారి మధ్య అవగాహనఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. దాదాపు ఒకే వయసు వాళ్లు కాబట్టి కలిసి తప్పులు చేస్తారు, కలిసి సంతోషంగా జీవిస్తారు. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు వయసు తేడాను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.
34
వయసు తేడా ఎక్కువంటే..
భర్త వయసులో చాలా పెద్దవాడు, భార్య చిన్న వయసు అయితే ఆ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవదు. వయసులో పెద్ద తేడా ఉంటే దంపతుల మధ్య అవగాహన ఉండదు. ఇది సజావుగా సాగే వైవాహిక జీవితానికి అడ్డంకిగా మారుతుంది.భార్యాభర్తల మధ్య 3 నుంచి 5 ఏళ్ల వయసు తేడా ఉంటే మంచిదే. అయితే,కొన్నిసార్లు ఈ వయసు తేడా 10 నుంచి 15 ఏళ్ల వరకు కూడా ఉంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. వరుడికి 30 ఏళ్లు ఉంటే, వధువు వయసు 25 నుంచి 30 మధ్య ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండకూడదు.
టీనేజీలో అమ్మాయిలు, అబ్బాయిల హార్లోన్లలో మార్పులు వస్తాయి. అమ్మాయిలలో ఈ మార్పు దాదాపు 13 ఏళ్ల వయసులో కనిపించడం మొదలవుతుంది. అబ్బాయిలలో 15 ఏళ్ల నుంచి జరుగుతుంది. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలలో ఈ హార్మోన్ల మార్పులు ముందే వస్తాయి. ఫలితంగా వారు అబ్బాయిల కంటే చిన్న వయసులోనే శారీరకంగా పరిణితి చెందుతారు. అందుకే అబ్బాయి కన్నా కొంతవరకు అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని చెబుతారు.