పడుకోగానే వెంటనే నిద్రపట్టాలంటే ఈ ఫార్ములా ట్రై చేయండి

First Published | Jun 28, 2024, 2:50 PM IST

స్ట్రెస్ తో కూడిన లైఫ్ వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చాలా మందికి రాత్రిళ్లు కంటినిండా నిద్ర ఉండటం లేదు. కానీ దీనివల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు ఒక ఫార్ములాను మాత్రం ఫాలో అయితే పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. 
 

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే మాత్రం మరుసటి రోజు బద్దకంగా, నీరసంగా అనిపిస్తుంది. అలాగే పనిపై ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ప్రతిరోజూ మీరు ఇదేవిధంగా నిద్రపోకపోతే మాత్రం గుండెజబ్బుల నుంచి ఊబకాయం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కంటినిండా నిద్రపోవాలంటే 10, 3, 2, 1 అనే ప్రత్యేక ఫార్ములాను ప్రయత్నించాలి. అసలు ఇదంటే ఏంటి? దీని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Sleep Quality

రాత్రిళ్లు ఎందుకు నిద్రపట్టదు? 

రాత్రిపూట వ్యాయామం చేస్తే రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. అలాగే హార్మోన్లు పెరగడం వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అలాగే బాగా ఒత్తిడి పెరగడం, రాత్రిపూట స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల నిద్రపట్టదని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


నిద్రపట్టకపోతే ఏం చేయాలి?

రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టాలంటే 10-3-2-1-0 ఫార్ములాను ఖచ్చితంగా ఫాలో కావల్సిందే. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఫార్ములాను గనుక మారు ఫాలో అయ్యారంటే నిద్రలేమి సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. 
 

పరిశోధన ఏం చెబుతోందంటే..?

బ్రిటన్ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ ఎస్ )కు చెందిన ఓ డాక్టర్ నిద్ర సమస్యల పరిష్కారానికి 10-3-2-1 ఫార్ములాను కనిపెట్టారు. ఈ ఫార్ములాను పాటించడం వల్ల మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. 

10, 3, 2, 1 0 స్లీపింగ్ ఫార్ములా అంటే ఏమిటి?

నిద్రపోవడానికి 10 గంటల ముందు - కెఫిన్ కంటెంట్ ఉన్న  డ్రింక్స్ ను తాగకూడదు. 
నిద్రపోవడానికి 3 గంటల ముందు - ఇతర ఫుడ్స్ ను లేదా ఆల్కహాల్ ను తాగకూడదు.
నిద్రవేళకు 2 గంటల ముందు - ఇక పని చేయకూడదు
నిద్రవేళకు 1 గంట ముందు - అన్ని ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లను ఆఫ్ చేసేయాలి. 

Sleeping time

నిద్రపోవడానికి 10 గంటల ముందు ఏం చేయకూడదు? 

ఈ సూత్రం ప్రకారం.. మీరు నిద్రవేళకు 10 గంటల ముందు నుంచి మీరు ఎలాంటి కెఫిన్ పానీయాలను తాగకూడదు. ఎందుకంటే కెఫిన్ మనల్ని ఉత్తేజంగా మార్చి నిద్రమత్తును వదిలిస్తుంది. దీనివల్లే రాత్రిళ్లు నిద్రపోవడం కష్టంగా మారుతుంది. 


నిద్రించడానికి 3 గంటల ముందు ఏం చేయకూడదు?

మీరు నిద్రపోవడానికి 3 గంటల ముందు ఆల్కహాల్ లేదా ఏదైనా మత్తు పానీయాలను అసలే తాగకూడదు. ఎందుకంటే ఇవి కూడా మీ నిద్రకు అంతరాయం కలిగించి మీకు నిద్రలేకుండా చేస్తాయి. 


నిద్రపోవడానికి 1 గంట ముందు ఏ పని చేయొద్దు? 

నిద్రపోవడానికి ఒక గంట ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లన్నింటినీ ఆఫ్ చేయాలి. అప్పుడే మీరు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఇది మీ మనస్సును ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంచుతుంది. 

click me!