ఈ సెక్సువల్ జెలసీ మరీ ఎక్కువైతే మీ బంధం పూర్తిగా దెబ్బతింటుంది. అలాంటి సమయాల్లో ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. సమస్య నుంచి బయటపడాలంటే.. ముందుగా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
ఒకవేళ గత సంబంధంలో వారు ఎదుర్కొన్న ద్రోహం కారణంగా వారికి సెక్సువల్ జెలసీ ఉంటే, వారిలో నమ్మకం కలిగేవరకు.. మిమ్మల్నిపూర్తిగా విశ్వసించే వరకు కాస్త ఓపికగా ఉండాలి. మీకు ఒకరిమీద ఒకరికి ఉన్న విశ్వాసాన్ని, ప్రేమను పున:పరిశీలించుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో జంటలకు కమ్యూనికేషన్ బాగా ఉపయోగపడుతుంది.