కంటికి కనిపించేదంతా.. తాజాయేనా? ఆకుకూరలు, పండ్ల కల్తీని గుర్తించడం ఎలా?

First Published | Aug 19, 2021, 2:41 PM IST

2006 లో, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చైనా నుండి దిగుమతి చేసుకున్న సీఫుడ్‌లో మలాకైట్ గ్రీన్ ఉన్నట్టుగా గుర్తించారు. అప్పటినుంచి  ఆక్వాకల్చర్‌లో మలాకీట్ గ్రీన్ వాడకాన్ని నిషేధించారు. 

ఆరోగ్యకరమైన ఆహారం.. ప్రతీ ఒక్కరూ తినాలనే కోరుకుంటారు. ఆకుపచ్చటి కూరగాయలు, తాజాపండ్లను తమ రోజువారీ ఆహారంలో చేర్చాలని తాపత్రయపడతారు. ఉన్నంతలో ప్రయత్నిస్తారు. అయితే మనం తింటున్న ఆకుపచ్చటి కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు నిజంగా ఆరోగ్యకరమైనవేనా? నిగనిగలాడుతూ కనిపించే వీటి వెనక కల్తీ దాగిఉందా? ఇలాంటి సందేహాలూ వస్తాయి...

ఆరోగ్యకరమైన ఆహారం.. ప్రతీ ఒక్కరూ తినాలనే కోరుకుంటారు. ఆకుపచ్చటి కూరగాయలు, తాజాపండ్లను తమ రోజువారీ ఆహారంలో చేర్చాలని తాపత్రయపడతారు. ఉన్నంతలో ప్రయత్నిస్తారు. అయితే మనం తింటున్న ఆకుపచ్చటి కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు నిజంగా ఆరోగ్యకరమైనవేనా? నిగనిగలాడుతూ కనిపించే వీటి వెనక కల్తీ దాగిఉందా? ఇలాంటి సందేహాలూ వస్తాయి...

Latest Videos


డిమాండ్ ఎక్కువవడంతో ఆహారపదార్థాలను తొందరగా అందించాలి. లేదా అమ్మకం ద్వారా లాభాలు గడించాలనే కోరికతో వ్యాపారులు మన నిత్యాహారాన్ని కల్తీ చేస్తున్నారు. తొందరగా పండేలా, తాజాగా కనిపించేలా రకరకాల రసాయనాలు వాడుతున్నారు. దీనికోసం మలాకైట్ గ్రీన్, కాపర్ సల్ఫేట్, రోడమైన్ బి, కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో ఆహారాన్ని విస్తృతంగా కల్తీ చేస్తున్నారు. 

మరి దీనికి విరుగుడు లేదా? కల్తీని గుర్తించడం ఎలా? ఆహారపదార్థాలు సహజమైనవేనని గుర్తించడం ఎలా? ఆకుపచ్చదనం వెనుక కల్తీ లేదని తెలుసుకోవడం ఎలా? అంటే ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఒక టెస్ట్ వీడియోను షేర్ చేసింది. ఆకుకూరలు మలాకైట్ తో ఎలా కల్తీ చేస్తారో ఇందులో చూపించారు. 

మలాకీట్ గ్రీన్ ను ఆహారపదార్థాల్లో వాడకాన్ని నియంత్రించారు. 2006 లో, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చైనా నుండి దిగుమతి చేసుకున్న సీఫుడ్‌లో మలాకైట్ గ్రీన్ ఉన్నట్టుగా గుర్తించారు. అప్పటినుంచి  ఆక్వాకల్చర్‌లో మలాకీట్ గ్రీన్ వాడకాన్ని నిషేధించారు. 

కల్తీ ఏజెంట్ : ఫుడ్ సైంటిస్టుల చెప్పినదాని ప్రకారం, మనదేశ ఆహార పరిశ్రమలో ఇప్పటికీ బాగా తెలిసిన కార్సినోజెన్ అనే మలాకైట్ గ్రీన్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇది తరచుగా మిరపకాయలు, దోసకాయ, బఠానీలు, బెండకాయలు, పాలకూరలను తాజాగా నవనవలాడుతూ గ్రీన్ గా కనిపించడానికి వాడతారు. ఈ రసాయన సమ్మేళనం ప్రమాదకరమైన దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, FSSAI ఇటీవల ఒక వీడియోను షేర్ చేసింది, ఇందులో ఆకుకూరలలో మలాకైట్ గ్రీన్ ఉందా, లేదా అని చెక్ చేయడానికి ఓ సింపుల్ టిప్ ను షేర్ చేశారు.

ఆకుకూరలు కల్తీ అయ్యాయా లేదా అని ఎలా తనిఖీ చేస్తారు. ఈ వీడియోలో ఏం చెప్పారంటే లిక్విడ్ పారాఫిన్‌లో ముంచిన దూదితో.. బెండకాయలను తుడిచి చూడండి... దూదిమీద రంగు మారకుంటే అవి తాజావి.. రంగు మారిందంటే అవి కల్తీవని అర్థం వాటిని వాడకపోవడం మంచిది. 

మలాకీట్ గ్రీన్ వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ విషపదార్థం వల్ల శరీరంలో కార్సినోజెనిసిస్, మ్యూటాజెనిసిస్, క్రోమోజోమల్ ఫ్రాక్చర్‌లు జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు శ్వాసకోశాల్లో విషపదార్థాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

click me!