వెండి నగలు ఇప్పుడు బాగా ట్రెండింగ్. వీటిని ఎప్పుడైనా, ఎలాగైనా వేసుకోవచ్చు. బంగారంలాగా మెరవవు.. కాస్త డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి నలుగురిలో మీకో కొత్త లుక్ ను ఇస్తాయి. ఏ కలర్ డ్రెస్ లేదా శారీ మీదికైనా సూట్ అవుతాయి. ఇండో-వెస్ట్రన్ డ్రెస్సింగ్ కి అద్భుతంగా ఉంటాయి. ఇది ఆగస్ట్ నెల. పండుగల నెల. రక్షా బంధన్ దగ్గర్లో ఉంది. ఈ సారి రాఖీకి వెండి నగలతో వెరైటీగా మీ లుక్ ని ట్రై చేయండి.
మామూలు కుర్తీలతో అద్బుతంగా స్టైలింగ్ చేయొచ్చు. ధరించే విధంగా ధరిస్తే వెండినగలు సూపర్ ట్రెండింగ్ ఫ్యాషన్ లుక్ ని ఇస్తాయి. రాఖీ రోజు సింపుల్ కుర్తీ మీదికి చేతికి కడ, సన్నటి కంకణాలు, కడియాలు... కాలి వేళ్ళకు వెండి రింగులు వేసుకుంటే ఫ్యాషన్ ఐకాన్ అయిపోతారు. అందర్లా కాకుండా స్పెషల్ గా ఉంటారు. చెవులకు సింపుల్ జుంకాలు... చందాబాలీస్ వేసుకుంటూ మీ డ్రెస్సింగ్ కంప్లీట్ అవుతుంది.
చీరల మీదికి వెండి నగలు : చీర మోస్ట్ సెక్సీయెస్ట్ అవుట్ ఫిట్. సంప్రదాయ వస్త్రధారణ కూడా.. ప్రపంచంలో ఇంకే డ్రెస్సింగ్ కీ ఇంత విభిన్నమైన పేరు లేదు. చక్కటి చీరకు, తెల్లటి వెండి ఆభరణాలు సూపర్ లుక్ ను ఇస్తాయి. చీర మీదికి చౌక్ సెట్, సొగసైన బ్యాంగిల్స్ స్టాక్, సొగసైన యాంకిల్ నగలతో పాటు... వేలికి రింగు జోడిస్తే చీరకు చక్కగా మ్యాచ్ అవుతాయి. చీరల్లో అనేక రకాలు.. ట్రెండ్ ని బట్టి దొరుకుతుంటాయి. ఈ రక్షా బంధన్ కు మీరు చీరలు ప్లాన్ చేస్తే.. ట్రెడిషనల్ కుందన్ పోల్కీతో పాటు, బ్రాడ్ బ్యాంగిల్స్‌ని వేసుకోండి.

లెహంగాలతో వెండినగలు : ఆల్ టైం ట్రెండింగ్ లెహంగాలు. ఇక పండుగలు, శుభకార్యాలకు స్పెషల్ గా కనిపించాలంటే లెహంగాలకు మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. ఈ లెహంగాల మీదికి మాంగ్ టికా, క్లాసిక్ చోకర్ సెట్, బ్యాంగిల్స్ స్టాక్, ఎంబోస్డ్ రింగ్, స్టేట్మెంట్ యాంక్లెట్, ఎంబోస్డ్ టో రింగ్ లు వేసుకుంటే.. రక్షాబంధన్ రోజు రాకింగ్ లుక్ మీ సొంతమవుతుంది.
ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ ను ఫాలో కావాలనే ప్రతీ ఒక్కరూ ట్రై చేస్తారు. అల్ట్రామాడ్రన్ స్టైల్స్ ను కొద్దిగానైనా పాటిస్తారు. సో మీరూ అలా ఫాలో అవుతున్నట్లైతే.. ఎంబోస్డ్ ఆంక్లెట్ కాడా, బ్రాడ్ రిస్ట్ బ్యాండ్, స్టేట్‌మెంట్ రింగ్ క్లాసిక్ చోకర్ సెట్ లతో కాంటెంపరరీ లుక్ ను సొంతం చేసుకోవచ్చు.
హై నెక్ డ్రెస్సింగ్ మీ రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీనికి కొన్ని రకాల వెండి ఆభరణాలు జోడించడం వల్ల అది మరింత అద్భుతంగా తయారవుతుంది. రకరకాల వెండి ఆభరణాలు మీ లుక్ ను మరింతగా మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పెద్ద జుంకాలు, వెండి నెక్లెస్ లేదంటే లాంగ్ నెక్లెస్, స్టడ్స్ బాగా సూటవుతాయి.
ఫుల్ స్లీవ్స్ : డ్రెస్సులు, చీరలకు ఫుల్ స్లీవ్స్.. కొత్తగా, డిఫరెంట్ లుక్ నిస్తుంది. అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. వెడల్పుగా ఉండే కడా చేతికి, అద్బుతమైన రింగ్ మీ లుక్ ను మార్చేస్తాయి.
చీలమండవరకు ఉండే పొడవు ప్యాంటు, గాగ్రాల మీదికి కూడా వెండినగలు బాగా సెట్ అవుతాయి. వీటిమీదికి కూడా చీలమండల వరకుండే కడా లేదా.. పట్టీలు బాగా సెట్టవుతాయి.